ఎర్ర చందనంతో ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. చంద్రబింబంలాంటి చర్మసౌందర్యం మీ సొంతం

|

Oct 16, 2024 | 9:08 AM

చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడే ఎర్ర చందనాన్ని ఉపయోగించారంటే ఖచ్చితంగా మీ ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. కొన్ని దశాబ్దాలుగా ఎర్ర చందనాన్ని చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తున్నారు. ఎలాంటి స్కిన్ అయినా సరే అద్బుతంగా పనిచేస్తుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగించడంలో సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఎర్ర చందనాన్ని ఈ పదార్ధాలతో కలిపి ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అలాంటి అద్భుత ఫేస్ ప్యాక్ తయారీ వినియోగం ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ఎర్ర చందనం, బొప్పాయి ఫేస్ ప్యాక్: రెండు, మూడు స్పూన్లు ఎర్ర చందనం పొడిలో సరిపడా బొప్పాయి గుజ్జు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని సుమారు 20 నుంచి 30 నిమిషాల పాటు  ఆరనివ్వాలి. ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా రెండు వారాలకొకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది. చర్మం ఆరోగ్యంగా, నిత్యం తాజాగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది.

2 / 5
ఎర్రచందనం, పాలు, తేనె ఫేస్ ప్యాక్- ఫేస్‌ప్యాక్‌ కోసం సరిపడా ఎర్ర చందనం పొడిని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల పాలు, టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. సుమారు  అరగంట పాటు అలాగే వదిలేయాలి. ప్యాక్‌ బాగా ఆరిన తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రెండు రోజులకొకసారి చేస్తే ముఖంపై మురికి తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

3 / 5
పెరుగు, ఎర్ర చందనం పొడి ఫేస్ ప్యాక్: రెండు స్పూన్లు ఎర్ర చందనం పొడిలో టేబుల్ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్‌ ఐదు నుంచి పది నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందే చేస్తే మీ చర్మం మెరిసిపోతుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి.

4 / 5
ఎర్రచందనం పొడి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్: ఎర్రచందనం పొడిలో సరిపడినంత రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయండి. 10-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. మీ ఫేస్ చాలా కాంతివంతంగా మెరుస్తూ కనిపిస్తుంది.

5 / 5
ఎర్ర చందనం, నిమ్మకాయ ఫేస్ ప్యాక్- ఎర్రచందనం పొడిలో రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒక సారి చేస్తే చర్మంపై జిడ్డు తొలగిపోతుంది. చర్మ రంధ్రాలను బిగుతుగా చేసి అదనపు నూనెలు విడుదల అవ్వకుండా చేస్తాయి. మీ చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.