
Papaya Skin Care

Papaya Skin Care

చర్మం దురద, ఎరుపుదనాన్ని తగ్గించడంతో బొప్పాయి సహాయపడుతుంది. బొప్పాయిలో మొక్కల ఆధారిత యాంటీఆక్సిడెంట్‌లు అధికంగా ఉంటాయి. ఇవి మృతకణాలను తొలగిస్తాయి. బొప్పాయి గుజ్జుతో ఎక్స్‌ఫోలియేట్ చేసుకుంటే చర్మంపై మురికి మొత్తం క్లీన్ అవుతుంది.

బొప్పాయిలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కణాలను ఆరోగ్యంగా మార్చుతుంది. బొప్పాయి తింటే చర్మం మృదువుగా, యవ్వనంగా మారుతుంది. ఇందులోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. బొప్పాయి గుజ్జుతో ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయి. మృతకణాలు తొలగుతాయి.

బొప్పాయి గుజ్జును ముఖానికి అప్లై చేయడం వల్ల ఫేసియల్ హెయిర్ తగ్గుతుంది. ఈ ప్యాక్‌ను క్రమంతప్పకుండా వాడితే ముఖంపై అవాంచిత రోమాలు మాయం అవుతాయి. బొప్పాయి చర్మంపై మచ్చలు, ట్యాన్ తొలగించడంలో సహాయపడుతుంది. బొప్పాయి తినడం వల్ల మొటిమల వల్ల వచ్చే మచ్చలు తగ్గుతాయి.