
త్వరగా నిద్ర లేవడం: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావంతో చాలా మంది రాత్రి లేట్‌గా పడుకొని ఉదయం లేట్‌గా లేస్తున్నారు. కానీ ఇది అస్సలు మంచిది కాదు. రాత్రి త్వరగా పడుకొని ఉదయం త్వరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. శరీరానికి శక్తి లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది.

లోతైన శ్వాస: ఉదయం నిద్రలేచిన వెంటనే 5 నిమిషాలు శ్వాస వ్యాయామాలు చేయండం అలవాటు చేసుకోవాలి. ఇది ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. అలాగే నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. మొత్తంమీద, ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో పాటు మీరు రోజంతా యాక్టీవ్‌గా ఉండేందుకు దోహదపడుతుంది.

ధ్యానం, యోగా: ఉదయం నిద్రలేవగానే ధ్యానం లేదా యోగా చేయడం అలవాటు చేసుకోండి. ఇది మానసిక ప్రశాంతతను పెంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాదు మనలోని చెడు ఆలోచలనలను దూరం చేస్తుంది. మీరు జీవింతంపై ఫోకస్ పెట్టేందుకు సహాయపడుంది.

సంగీతం వినడం: ఉదయం నిద్ర లేచిన వెంటనే మీకు ఇష్టమైన సంగీతాన్ని వినండి. ఇది మీ మనస్సుకు ఎంతో హాయినిస్తుంది. అప్పుడు మీ శరీరంలో ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది, ఇది సంతోషకరమైన హార్మోన్, ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది

సూర్యరశ్మిని పొందండి: ఉదయం నిద్ర లేచిన తర్వాత వ్యాయామం పూర్తి చేసుకొని కొంత సమయం ఎండలో గడపండి. ఇది మీకు తగినంత విటమిన్ డి పొందడానికి, మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే, రోజును సానుకూల ఆలోచనలతో ప్రారంభించండి. పోషకమైన అల్పాహారం తీసుకోండి. ఈ అలవాట్లను మీరూ క్రమం తప్పకుండా పాటిస్తే.. కచ్చితంగా మీరు రిజల్ట్స్ చూస్తారు.