ఆయుర్వేద గ్రంథాలలో బే ఆకులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇవి యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటామి. ఇది ఫంగస్, ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది. నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బే ఆకులతో చేసిన టీ న్యుమోనియా రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టీలో ఒక ఆకు, ఒక పెద్ద ఏలకులు, కొద్దిగా బెల్లం కూడా జోడించవచ్చు. బాగా మరిగించి వడకట్టి, కొంచెం కొంచెం సిప్ చేస్తే హాయిగా ఉంటుంది.