
జీర్ణశక్తిని బలపరుస్తుంది: అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మిరియాలు ఎంజైమ్‌ల విడుదలను పెంచుతాయి. ఫలితంగా జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలకు ఇది మంచి మందు.

అరటి పండ్లను ఓట్‌మీల్, మిల్క్‌షేక్, స్మూథీ, సలాడ్స్‌లోనూ వేసుకోవచ్చు, స్వీట్లూ చేయొచ్చు. ఇన్ని లాభాలున్నప్పటికీ.. అలర్జీలు, ఉబ్బసం, సైనస్ లాంటి ఇబ్బందులేమైనా ఉండి బాధపడుతుంటే మాత్రం అరటిపండుకు దూరంగానే ఉండాలి.

బరువు నియంత్రణ: బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ సొల్యూషన్. అరటిపండు శరీరానికి శక్తిని ఇస్తుంది. పెప్పర్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. శరీరంలోని కొవ్వును వేగంగా కరిగిస్తుంది. ఈ రెండింటినీ కలిపి తినటం వల్ల ఎక్కువ కాలం ఆకలికి దూరంగా ఉంచుతుంది. ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది.

చర్మ సంరక్షణ: అరటిపండులోని విటమిన్లు, మిరియాలలోని యాంటీఆక్సిడెంట్లు చర్మానికి అంతర్గతంగా పోషకాలను అందిస్తాయి. ఈ పరిహారం శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది.

మానసిక ఆరోగ్యం: అరటిపండులో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. మిరియాలు మానసిక అలసటను తగ్గిస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది.