
బరువు పెరగడం ప్రారంభించే వారికి అరటిపండు ఒక వరం లాంటిది. ఇందులో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు, అధిక కేలరీలు ఉంటాయి. ఇవి శరీరానికి వెనువెంటనే శక్తిని ఇస్తాయి. ఇది సులభంగా జీర్ణమవుతుంది. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనిని తీసుకోవచ్చు. పొటాషియం, ఫైబర్, విటమిన్ B6 పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

శరీరం దృఢంగా మారాలి, కండరాలు పెరగాలి అనుకునే వారికి గుడ్లు మంచి ఆహారం. గుడ్లలో హై-క్వాలిటీ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కాల్షియం, ఐరన్, జింక్, విటమిన్ డి వంటి అవసరమైన ఖనిజాలు ఇందులో లభిస్తాయి. ఇవి కండరాలను బలోపేతం చేస్తాయి. వ్యాయామం చేసేవారు రోజుకు 2 నుండి 4 గుడ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరుగుతారు.

ఉడికించిన గుడ్లు గది ఉష్ణోగ్రత వద్ద 6 నుంచి 7 గంటల కంటే ఎక్కువ సమయం సురక్షితంగా ఉండవు. అవి త్వరగా చెడిపోయే అవకాశం ఉంది. గుడ్డు బలమైన చెడు వాసన కలిగి ఉండి, రంగు మారినట్లు కనిపిస్తే దానిని తినకూడదు.

మరి ఏది బెస్ట్: అరటిపండ్లు కేలరీలను ఇస్తే.. గుడ్లు కండరాలను నిర్మిస్తాయి. కాబట్టి రెండింటినీ కలిపి తీసుకోవడం అత్యంత ప్రయోజనకరమని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరానికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లను ఏకకాలంలో అందిస్తుంది.

కేవలం వీటిపైనే ఆధారపడకుండా మీ ఆహారంలో పప్పులు, పాలు, తృణధాన్యాలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ చేర్చుకోండి. వీటితో పాటు తగినంత నిద్ర, క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేస్తేనే ఆరోగ్యకరమైన బరువు మీ సొంతమవుతుం