
బ్రెడ్ మలై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : బ్రెడ్, పాలు, నెయ్యి, జీడిపప్పు, బాదం, గుమ్మడి గింజలు, మిల్క్ పౌడర్, చక్కెర, యాలకుల పొడి, డీప్ ఫ్రైకి సరిపడ నూనె.

తయారీ విధానంలోకి వెళితే.. పది మిల్క్ బ్రెడ్ తీసుకోండి. ఎందుకంటే ఇది కాస్త మెత్తగా ఉంటుంది. ఈ స్వీట్‌కు ఫర్పెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బ్రెడ్‌లో నాలుగు ముక్కలు వచ్చేలా కట్ చేసుకోవాలి. సైడ్స్‌కు ఉండే బ్రౌన్ కలర్ పార్ట్‌ను కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి.

ఇప్పుడు బ్రెడ్ మొక్కలను స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, అందులో డీప్ ఫ్రైకి సరిపడ నూనె పోసి, ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో వేసి బాగా, బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రెడ్ మాడి పోకుండా రెండు పక్కల బంగారు రంగు వచ్చే వరకు వేయించుకొని, తర్వాత వాటిని వేరే ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు చక్కెర పాకం తయారు చేసుకోవాలి. దాని కోసం అర కప్పు చక్కర, అరక కప్పు నీళ్లు తీసుకొని బాగా మరిగించాలి. పాకం చిగురుగా వచ్చిన తర్వాత ఒక్క చుక్క నిమ్మ రసం పిండి , అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసుకోవాలి. కాసేపు వాటిని చల్లారబెట్టుకోవాలి. దీని వలన బ్రెడ్ చాలా తియ్యగా టేస్టీగా ఉంటుంది.

ఇప్పుడు మనం మలై తయారు చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో పాలు, యాలకుల పొడి, మిల్క్ పౌడర్ వేసి బాగా కలపాలి, మిశ్రమం చిక్కబడే వరకు కలుపుతూనే ఉండాలి. దీంతో మిశ్రమం దగ్గరగా, క్రీమ్‌లా తయారు అవుతుంది. అప్పుడు మనం పాకంలో వేసిన బ్రెడ్ ముక్కలను తీసుకొని, ఒక దానిపై క్రీమ్ రాసి, దానిపై మరో బ్రెడ్ ముక్కను పెట్టాలి. అంతే టేస్టీ టేస్టీ బ్రెడ్ మలై రెడీ. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.