
అల్లం, వెల్లుల్లి: అల్లం, వెల్లుల్లి తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ వేసవిలో వీటిని పరిమితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి శరీరంలో అంతర్గత ఉష్ణోగ్రతను పెంచుతాయి. దీనివల్ల జీర్ణక్రియలో ఇబ్బందులు కలగడమే కాకుండా, విపరీతమైన దాహం వేసేలా చేస్తాయి.

పచ్చిమిర్చి: సమ్మర్ పచ్చిమిర్చి ఎక్కువగా తినడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే వీటిలో 'క్యాప్సైసిన్' అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి తక్షణమే వేడిని కలిగిస్తుంది. దీనివల్ల అతిగా చెమట పట్టడం, ఫలితంగా శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం జరుగుతుంది.

ఆకుకూరలు: సమ్మర్ ఆకు కూరలు కూడా శరీరంలో వేడి పెంచుతాయి. పాలకూర, ఆవకూర వంటి ఆకుకూరల్లో ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని అరిగించుకోవడానికి శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది, దీని వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు కొన్ని ఆకు కూరలకు దూరంగా ఉండండి.

ఉల్లిపాయలు: వేసవిలో అతిగా ఉల్లిపాయలు తినడం వల్ల శరీరంలో సల్ఫర్ పరిమాణం పెరుగుతుంది. ఇది గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది. వేసవిలో వీటిని వాడే ముందు కాసేపు నీటిలో గానీ లేదా వెనిగర్‌లో గానీ నానబెట్టి వాడటం మంచిది.

దుంపలు, క్యారెట్: చిలకడదుంపలు వంటి పిండి పదార్థం ఎక్కువగా ఉండే కూరగాయలు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది వేసవిలో శరీరానికి నీరసాన్ని కలిగిస్తుంది. అలాగే క్యారెట్లు కూడా.. ఇవి ఆరోగ్యకరమే అయినప్పటికీ, వీటిలో నీటి శాతం తక్కువగా ఉంటుంది. వీటి జీర్ణక్రియకు శరీరం ఎక్కువ నీటిని ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వీటి వాడకాన్ని తగ్గించడం మంచిది.

కాబట్టి వేసవిలో సొరకాయ, బీరకాయ, దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇవి బాడీలో నీటిశాతాన్ని పెంచి శరీరాన్ని హైడ్రెడ్‌గా ఉంచుతాయి. ( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం మేరకు అందించబడినవి.. వీటిని TV9 దృవీకరించడం లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.