
ప్రస్తుత బిజీ లైఫ్ కారణంగా చాలా మంది నైట్ ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకొని తిని అలానే పడుకుంటారు. కానీ ఇది చాలా తప్పు. మీరు పడుకునే 2-3 గంటల ముందు భోజనం ముగించాలి. అప్పుడే మీరు తిన్న ఆహారం మంచిగా జీర్ణం అవుతుంది. లేదంటే రాత్రిపూట జీర్ణ సమస్యలు, నిద్ర పట్టకపోవడం, మరుసటి రోజు అలసిపోతారు. అంతే కాదు, రాత్రి ఆలస్యంగా తినే అలవాటు మీ కడుపు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి పడుకునే 2-3గంటలకు ముందే భోజనం ముగించుకోవడం చాలా ఉత్తమం

అయితే టైం మాత్రమే కాదు. రాత్రి పూట ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవేంటనే విషయానికి వస్తే రాత్రి పూట వేయించిన ఆహారాలు అంటే చికెన్ లేదా ఏదైనా మాంసం వంటకాలు, బోండా, చిప్స్, నూడుల్స్, ఫ్రైడ్ రైస్ వంటివి తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే ఇవి శరీరంలో జీర్ణ సమస్యలు, ఆమ్లత సమస్యలను కలిగిస్తాయి.

అలాగే ఎక్కువగా చక్కెర అధికంగా ఉండే ఆహారాలు కూడా తీసుకోకూడదు. ఐస్ క్రీం, స్వీట్లు, హై షుగర్ మిల్క్, టీ తాగడం మానుకోవాలి. ఎందుకంటే ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. దీని వల్ల రాత్రి మీరు సరిగ్గా నిద్రపోలేరు. ఇది మీ నిద్రకు అంతరాయం కలిగించడమే కాకుండా శరీరంలో ఊబకాయం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

రాత్రి మటన్ లేదా రెడ్ మీట్ వంటి ఆహారాలను కూడా పూర్తిగా తగ్గించాలి. ఎందుకంటే వీటిలో ప్రోటీన్, కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి కనీసం 5 గంటల సమయం పడుతుంది. అయితే, మీరు వాటిని రాత్రిపూట తిని పడుకుంటే, మీ శరీరం వాటిని పూర్తిగా జీర్ణం చేసుకోదు. దీనివల్ల మీకు నిద్ర పట్టకపోవడం, మరుసటి రోజు ఉదయం మీరు అలసిపోయినట్లు అనిపించడం జరుగుతుంది

అలాంటి ఫుడ్స్‌కు బదులుగా మీరు రాత్రి పూట వీలైనంత ఎక్కువ తేలికైన, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. అంటే పండ్లు వంటి తినండి. లేదా చపాతీ, లైట్‌గా రైస్ కూడా తీసుకోవచ్చు. Note: పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా మాత్రమే అందించబడిని.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు.. వీటిపై మీకేవైనా డైట్స్ ఉంటే వైద్యులను సంప్రదించండి)