
పీతల పులుసు పెట్టడానికి కావాల్సిన పదార్థాలు : చింత పండు రసం, కారం, ఉప్పు, పచ్చి మిర్చి, పీతలు, ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి, నూనె, మొంతి పొడి.

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా పీతలను చాలా శుభ్రంగా కడగాలి. నీటిని వేడి చేసి అందులో ఉప్పు, పసుపు వేసి, అవి కాస్త బాగా మరిగిన తర్వాత అందులో పీతలను వేసి శుభ్రం చేసుకోవాలి. తర్వాత వీటిని చల్లటి నీటిలో మరోసారి శుభ్రం చేసి వేరే బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు పీతల పులుసు తయారు చేసుకోవాలి. దీని కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టాలి. అందులో పీతల పులుసు తయారు చేయడానికి కావాల్సిన నూనె వేసుకోవాలి. అందులో లవంగాలు, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చీ వేసి బాగా వేపుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.

ఇప్పుడు అందులో టమాటా ముక్కలు వేసి మరో ఐదు నిమిషాల వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో చింత పండు రసం వేసి బాగా మరగబెట్టుకోవాలి. తర్వాత అందులో పీతలను వేసి బాగా మరగబెట్టుకోవాలి. పీతలు బాగా ఉడికేలా చూసుకోవాలి.

ఇప్పుడు అవి కాస్త ఉడికిన తర్వాత కారం, ఉప్పు వేసుకోవాలి. ఒక ఐదు నిమిషాల తర్వాత మెంతి పొడి, ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మరగ బెట్టుకోవాలి. మరో ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ పీతల పులుసు రెడీ. ఇలా చేసి తింటే ఎవ్వరైనా సరే ఈ రుచికి ఫిదా అయిపోతారు.