ఆంధ్ర‌స్టైల్ మునక్కాడ రసం.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు!

Updated on: Apr 27, 2026 | 9:54 AM

ఏ శుభకార్యం జరిగినా సరే, ఇంటిలో ఏ పూజ చేసుకున్నా సరే, వంటకాల్లో తప్పకుండా రసం ఉండాల్సిందే. ముఖ్యంగా మునక్కాడ రసం అంటే ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టం ఉంటుంది. మరి మీరు కూడా అలా రసం చేయాలి అనుకుంటున్నారా? అయితే ఆంధ్ర స్టైల్ మునక్కాడ రసం ఎలా చేయాలో చూసేద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు : చింత పండు , మునక్కాడలు, టమాటా, కరివేపాకు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, ఎండు మిర్చి, ఉప్పు, పసుపు, ఉప్పు, బెల్లం, కొత్తిమీర తరుగు, కొంచెం బెల్లం.

2 / 5
తయారీ విధానం : ముందుగా మునక్కాడలు తీసుకోవాలి. వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని పైన పొట్టు తీసి శుభ్రం చేసుకోవాలి.  వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మునక్కాడ రసం కోసం, ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. అందులో మునక్కాడల్లో కొన్నింటిని కుక్కర్‌లో వేయాలి. అలాగే టమాటాలు, చింతపండు రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి, కొన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి.

3 / 5
రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే మెత్తగా ఉడికిపోతాయి మునక్కాడలు. ఇప్పు దీనిని పప్పు దువ్వెనతో మంచిగా స్మాష్ చేయాలి. దానిని మొత్తం ఒక గ్రేవీలా మెత్తగా చేసి, దానిని జాలీతో వడబోయాలి. ఇలా చేయడం వలన అందులో ఉన్న మునక్కాడల పిప్పి మొత్తం పోతుంది. ఈ రసాన్ని పక్కన పెట్టుకోవాలి.

4 / 5
ఇప్పుడు మసాలా తయారు చేసుకోవాలి. దీని కోసం కంది పప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు,వేయించుకున్న కరివేపాకు వేసి మంచిగా గ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలాతో మునక్కాడ రసం టేస్ట్ అదిరిపోతుంది. అంతే కాకుండా కమ్మటి వాసన కూడా వస్తుంది.

5 / 5
ఇప్పుడు రసం తాళింపు పెట్టుకోవాలి. దీని కోసం ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. బౌల్ పెట్టి, నూనె పోయాలి. తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ , కొత్తిమీర, కరివేపాకు, ఎండు మిర్చి, పసుపు వేసి మంచిగా వేగిన తర్వాత అందులో రసం వేయాలి. ఇది కాస్త మరగగానే మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా పొడి వేయాలి.ఇలా దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఈ రసం మరిగేలా చూడాలి. మళ్లీ చివరన కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేస్తే అంతే టేస్టీ టేస్టీ వేడి వేడి మునక్కాడ రసం రెడీ. ప్రతి ఒక్కరూ దీనిని చాలా ఇష్టంగా తింటారు.

Follow Us