
అట్ల తద్దె సందర్భంగా, మహిళలు ఖచ్చితంగా తమ చేతులకు మెహందీని పెట్టుకుంటారు. కొందరు మహిళలు మెహందీని చేతుల నిండా పెట్టుకోవడానికి ఇష్టపడతారు. మరికొందరు సాధారణ డిజైన్లను ఇష్టపడతారు. అటువంటి పరిస్థితిలో, మెహందీ సాధారణ డిజైన్‌లు ఇక్కడ ఉన్నాయి. మీరు వీటిని కూడా ప్రయత్నించవచ్చు.

అరబిక్ బెల్ డిజైన్ - మీరు అట్ల తద్దె సందర్భంగా అరబిక్ బెల్ డిజైన్‌ను వేసుకోవడానికి ఆసక్తిని చూపించవచ్చు. అరబిక్ డిజైన్ ఎటువంటి సందర్భంలోనైనా మహిళలు చాలా ఇష్టపడతారు. మీరు సాధారణ మెహందీ డిజైన్‌ను వేసుకోవాలని భావిస్తే.. మీరు అరబిక్ బెల్ డిజైన్‌ను ట్రై చేయవచ్చు.

బ్రాస్లెట్ మెహందీ డిజైన్ - మీరు మీ చేతుల్లో బ్రాస్లెట్ మెహందీ డిజైన్‌ను కూడా ట్రై చేయవచ్చు. ఈ డిజైన్ చేతుల వెనుక భాగంలో నుంచి మొదలవుతుంది. అందమైన పువ్వులు మరియు ఆకుల డిజైన్‌తో మీ చేతులకు బ్రాస్‌లెట్ లా మెహందీ డిజైన్‌ను పెట్టుకోవచ్చు. ఈ మెహందీ డిజైన్ చాలా అందంగా కనిపిస్తుంది.

రౌండ్ మెహందీ - బ్యాంగిల్ స్టైల్ రౌండ్ అరబిక్ మెహందీ డిజైన్ చాలా సులభం. ఈ డిజైన్ చేతులకు చాలా అందంగా కనిపిస్తుంది. మీరు ఈ రౌండ్ మెహందీ డిజైన్‌ను అరచేతి వెనుక, ముందు భాగంలో అప్లై చేయవచ్చు. ఈ డిజైన్ పువ్వులా అందంగా కనిపిస్తుంది.

ఫ్లవర్ మెహందీ - ఈ డిజైన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. చేతుల అందాన్ని మెరుగుపరుస్తుంది. దీని కోసం..ఇక్కడ ఉన్న ఫొటోలో చూపించిన విధంగా చిన్న చిన్న పువ్వులను చేతులకు అప్లై చేసుకోవాలి. ఈ మెహందీ డిజైన్ చాలా సింపుల్ గా అందంగా కనిపిస్తూ అలరిస్తుంది.