Uniform Civil Code: యూనిఫామ్ సివిల్ కోడ్‌పై ఇప్పటివరకు ఎంతమంది అభిప్రాయాలు పంపించారో తెలుసా ?

Updated on: Jul 11, 2023 | 7:49 PM

ఇటీవల తెరపైకి వచ్చిన యూనిఫామ్ సివిడ్‌ కోడ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ఉమ్మడి పౌరస్మృతిపై తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు ఓ వైపు గడువు కూడా దగ్గరికొస్తోంది. ఇప్పటివరకు యూనిఫామ్ సివిల్ కోడ్‌పై 46 లక్షల అభిప్రాయాలు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

1 / 5

2 / 5
అలాగే రాబోయే రోజుల్లో కూడా కొన్ని సంస్థలు, పౌరుల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు లా కమిషన్ సైతం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు కూడా వెళ్లినట్లు సమాచారం. జూన్ 14 నుంచి యూసీసీపై సంప్రదింపులు మొదలుపెట్టిన లా కమిషన్.. పౌరులతో సహా మతపరమై సంస్థలు, అలాగే వివిధ భాగస్వామ్య పక్షాలను కూడా తమ అభిప్రాయాలు చెప్పాలని తెలిపింది.

3 / 5
మరో విషయం ఏంటంటే 2018 ఆగస్టులో ముగిసిన 21వ లా కమిషన్ సైతం యూనిఫామ్ సివిల్ కోడ్ అంశాన్ని పరిశీలించింది. అలాగే రెండుసార్లు ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించి ఓ నివేదికను కూడా విడుదల చేసింది. కాని ప్రస్తుతం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్లీ ఇప్పుడు సంప్రదింపులు ప్రారంభిస్తు్న్నామని 22వ లా కమిషన్ జూన్ 14వ తేదిన ఓ నోటిస్ విడుదల చేసింది.

4 / 5
యూనిఫామ్ సివిల్ కోడ్‌పై ప్రజల అభిప్రాయలు అలాగే వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఆసక్తి ఉన్నవారు 30 రోజుల్లో లా కమిషన్‌కు 
membersecretary-lci@gov.in అనే ఈ-మెయిల్‌ ద్వారా లేదా ప్రత్యేక లింకు ద్వారా తమ అభిప్రాయాలు పంపాలని పేర్కొంది.

యూనిఫామ్ సివిల్ కోడ్‌పై ప్రజల అభిప్రాయలు అలాగే వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఆసక్తి ఉన్నవారు 30 రోజుల్లో లా కమిషన్‌కు membersecretary-lci@gov.in అనే ఈ-మెయిల్‌ ద్వారా లేదా ప్రత్యేక లింకు ద్వారా తమ అభిప్రాయాలు పంపాలని పేర్కొంది.

5 / 5
ఇదిలా ఉండగా రాబోయే శీతాకాల సమావేశాల్లో కేంద్రం ఉమ్మడి పౌరస్మృతి బిల్లు తీసుకురావచ్చన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. అయితే యూసీసీ ప్రకారం మత భేదం లేకుండా దేశ ప్రజలందరికి కూడా ఒకే చట్టం ఉంటుంది. వారసత్వం, దత్తత, విడాకులు లాంటి మతపరంగా ఉండే 'పర్సనల్ లా' లకు ఒకే చట్టం వర్తిస్తుంది.

Follow Us