పట్టులాంటి మెరిసే జుట్టు కావాలంటే.. ఈ నీటిని పారబోయకుండా వాడేయండి..! రిజల్ట్ చూసి మీరే షాక్‌ అవుతారు..

|

Oct 22, 2024 | 1:51 PM

జుట్టు సమస్యలను నివారించేందుకు కెమికల్‌ ఆధారిత చికిత్సలతో లాభం కంటే, నష్టాలే ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ, కొన్ని ఇంటి చిట్కాలతో జుట్టు సమస్యలను ఇట్టే దూరం చేసుకోవచ్చునని చెబుతున్నారు. అలాంటి ఇంటి చిట్కాలలో జుట్టు సమస్యలకు బియ్యం నీరు చక్కటి పరిష్కారం అంటున్నారు. దీంతో మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా నిగనిగలాడుతూ పెరుగుతుంది. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం...

1 / 6
తలస్నానం చేశాక ఈ రైస్ వాటర్‌ను తలకు పట్టించి, కాసేపు అలాగే ఉంచాలి. తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వెంట్రుకల పెరుగుదలకు బియ్యం నీరు సహాయపడుతుంది. బి, సి, ఇ, కె విటమిన్లు బియ్యం నీటిలో పుష్కలంగా లభిస్తాయి. ఇది ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

2 / 6
ఈ రైస్ వాటర్‌లో ఉండే కొన్ని సహజ పదార్థాలు మన జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టిన తర్వాత, కడిగి వడకట్టినప్పుడు మిగిలే నీటిని హెయిర్ కేర్ కోసం వాడితే చక్కటి ఫలితం ఉంటుంది. లేదంటే అన్నం వండేటప్పుడు తీసే గంజిని చల్లార్చి వాడినా కూడా ఉపయోగం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

3 / 6
బియ్యం నీటిలో అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇది జుట్టు నష్టాన్ని తగ్గిస్తుంది. చుండ్రు, జిడ్డుగల జుట్టు, తలలో దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది. బియ్యం నీరు మీ తలని లోతుగా శుభ్రపరుస్తుంది. జిడ్డు లేకుండా చేస్తుంది. అంతే కాదు, పొడి, చిక్కు పడే జుట్టు ఉన్నవారికి ఇది గొప్ప కండీషనర్‌గా కూడా పనిచేస్తుంది.

4 / 6
బియ్యం నీటిలో విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల బియ్యం నీటిని జుట్టుకు అప్లై చేయడం వల్ల మీ జుట్టు ఒత్తుగా, సిల్కీగా తయారవుతుంది.  బియ్యం నీరు చుండ్రును కూడా తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. బియ్యం నీటిలో పొటాషియం, అయోడిన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, మాంగనీస్, ఎక్కువ ఫైబర్ ఉంటాయి.

5 / 6
బియ్యం నీటిని క్రమం తప్పకుండా మీ జుట్టుకు అప్లై చేయటం వల్ల స్ప్లిట్ ఎండ్స్ ను తగ్గిస్తుంది. బియ్యం నీరులో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాకుండా సిల్కీగా కూడా చేస్తుంది. కాబట్టి జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు కూడా దీనిని ఉపయోగించవచ్చు.

6 / 6
ఒక్క బియ్యం నీటితో అటు మీ చర్మాన్ని, ఇటు మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మీ చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి బియ్యం నీటిని రెగ్యులర్ గా ఉపయోగించండి. బియ్యం నీరు ముఖ రంధ్రాలను తగ్గించి మీ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఈ బియ్యం నీటిని క్రమం తప్పకుండా వాడితే ప్రకాశవంతమైన, మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది. మొటిమల నివారణకు కూడా బియ్యపు నీటిని వాడవచ్చు.