
కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. వీటిల్లో శరీరానికి కావాల్సినన్ని పోషకాలు లభిస్తాయి. వైద్యులు కూడా కూరగాయలనే ఎక్కువగా తినాలని చెబుతూ ఉంటారు. అయితే చవకగా ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో కూరగయాలు కొంటూ ఉంటారు. కానీ ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు.

ఫ్రిజ్‌లో పెట్టినా కూడా పాడైపోతూ ఉంటాయి. అలాగని రోజూ కూరగాయలు కొని తీసుకురావాలంటే పెద్ద పనే. ఇలాంటి సమస్యను చాలా మంది ఫేస్ చేస్తూనే ఉంటారు. మరి కూరగాయలను ఎలా స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రిజ్‌లో స్టోర్ చేసేటప్పుడు కూరగాయలు, పండ్లును వేరు వేరుగా స్టోర్ చేయాలి. ఉల్లి పాయలను ఎప్పుడూ గాలి, వెలుతురు వచ్చే ప్రదేశంలో ఉంచాలి. ఆకు కూరలు వాడిపోకుండా ఉండాలంటే.. వీటిని మందపాటి పేపర్స్‌లో చుట్టి.. తడి క్లాత్‌లో పెట్టాలి.

పచ్చి మిర్చి నిల్వ ఉండాలంటే.. వీటికి ఉన్న కాడలు తీసేసి.. కవర్ లేదా కంటైనర్‌లో గాలి తగలకుండా ప్యాక్ చేయాలి. అలాగే వెల్లుల్లిని కూడా గాలి తగిలేలా పెట్టాలి.

ఇతర కూరగాయలను అన్నీ కలిపి కాకుండా.. వేటికి అవి సపరేటుగా కవర్ లేదా కంటైనర్‌లో పెట్టాలి. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనే వెజిటేబుల్స్.. ఫ్రీజర్ కింద భాగంలో స్టోర్ చేసుకుంటే మంచిది.