
సాధారణంగా కలలు రావడం సహజం. ఈ కలలు అనేక రకాలుగా వస్తాయి. ఈ కలల్లో పీడ కలలు కూడా ఒకటి. సాధారణ కలలు కంటే.. పీడ కలలు వస్తే మనం ఎక్కువగా భయ పడుతూ ఉంటాం. రోజంతా వాటినే తలచుకుంటూ ఉంటారు. ఈ పీడ కలల వలన ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందట.

మీకు ఎక్కువగా పీడ కలలు వస్తూ ఉంటే మీలో ఒత్తిడి, ఆందోళన అనేవి పెరుగుతూ ఉంటాయి. నిద్రలో నుంచి లేచిన తర్వాత.. కాసేపు మీకు అయోమయంగా ఉంటుంది. ప్రతీ దానికి భయ పడుతూ ఉంటారు. దీంతో మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.

పీడకలలు తరచూ రావడం వల్ల మీ నిద్రపై కూడా ప్రభావం పడుతుంది. చాలా మంది పీడ కలల వల్ల భయంతో సరిగ్గా నిద్రపోరు. దీంతో పలు రకాల అనారోగ్య, దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి.

పీడ కలల వలన మీకు కోపం, విచారం, భయం వంటివి పెరుగుతాయి. మీరు నిద్ర లేచినా కూడా ఈ భావాలు చాలా సేపటి వరకూ ఉంటాయి. ఇది మీ రోజుపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. దీంతో ఎంతో నిరాశకు గురవుతారు.

పీడ కలల వలన మీ పనిపూ కూడా ప్రభావం పడుతుంది. రోజంతా యాక్టీవ్‌గా ఉండలేరు. ఏకాగ్రత నశిస్తుంది. ఇతరులపై చిరాకు పడుతూ ఉంటారు. ఇతరులతో మాట్లాడటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు.