పుట్టగొడుగులు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలియకపోతే ప్రాణాలకే ముప్పు..

Updated on: Feb 10, 2026 | 6:55 AM

Mushrooms: పోషకాహార నిపుణులు సూచించే సూపర్ ఫుడ్స్‌లో పుట్టగొడుగులు ఒకటి. అయితే, ప్రతి నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్నట్లే.. పుట్టగొడుగుల వల్ల కూడా కొన్ని ఆరోగ్య పరమైన రిస్కులు ఉన్నాయి. ఇటీవల కాలంలో వీటిని తిన్న తర్వాత అలెర్జీలు, శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అసలు మీ శరీరతత్వానికి పుట్టగొడుగులు సరిపడతాయా? అలెర్జీ లక్షణాలు ఎలా ఉంటాయి? అనేది తెలుసుకుందాం..

1 / 5
పుట్టగొడుగులు.. వీటిని వెజిటేరియన్ మీట్ అని కూడా పిలుస్తారు. రుచికి రుచి, పోషకాల్లో మేటి కావడంతో చాలామంది వీటిని ఇష్టంగా తింటారు. ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ ఇవి అందరికీ అమృతం కావు.. కొందరికి ఇవి విషంగా మారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2 / 5
పుట్టగొడుగులు సహజంగానే ఒక రకమైన ఫంగస్. కాబట్టి అందరి శరీరతత్వానికి ఇవి సరిపడవు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు పుట్టగొడుగులు తింటే వెంటనే అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. దురద, వాపు, ముక్కు కారటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తవచ్చు. చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉన్నవారు వీటికి దూరంగా ఉండటమే మంచిది.

3 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని రకాల పుట్టగొడుగులు జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మీకు తరచుగా గ్యాస్, ఎసిడిటీ లేదా మలబద్ధకం వంటి సమస్యలు ఉంటే పుట్టగొడుగులను ఎక్కువగా తినకండి. ఇవి పొట్టలో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. గర్భధారణ సమయంలో పుట్టగొడుగులను నివారించడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. వీటిలోని కొన్ని ఎంజైమ్‌లు గర్భిణీలకు అలెర్జీ కలిగించే అవకాశం ఉంది.

4 / 5
వర్షం పడిన తర్వాత చాలామంది ఇళ్ల దగ్గర లేదా అడవుల్లో పెరిగే పుట్టగొడుగులను తెంపి వండుకుంటారు. ఇది అత్యంత ప్రమాదకరం.. అడవిలో లేదా చెట్ల కింద పెరిగే కొన్ని రకాల పుట్టగొడుగులు ప్రాణాంతకమైన విషాన్ని కలిగి ఉంటాయి. ఏది తినదగినది, ఏది విషపూరితమైనది అనేది సామాన్యులు గుర్తించడం అసాధ్యం. కాబట్టి బయట దొరికే వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.

5 / 5
సూపర్ మార్కెట్లలో లేదా గుర్తింపు పొందిన షాపుల్లో దొరికే పుట్టగొడుగులను మాత్రమే కొనండి. వండే ముందు గోరువెచ్చని నీటితో వీటిని శుభ్రంగా కడగాలి. ఏదైనా సరే అమితంగా తింటే ప్రమాదమే.. కాబట్టి పరిమితంగానే తీసుకోండి.