ఖర్జూరంలో పోషకాలు అధికంగా ఉంటాయి. చాలామంది ఖర్జూరం ఇష్టంగా తింటారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు మితంగా తింటేనే మంచిది. ఖర్జూరంలో ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్లు ఎ, కె, బి-కాంప్లెక్స్ విటమిన్ లు సమృద్దిగా ఉంటాయి. ఖర్జూరంలో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది.