యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజు ఒక్క యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంటారు. నిజమే.. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఇస్తుంది యాపిల్. కానీ యాపిల్ గింజలను తింటే ఆరోగ్యానికి ప్రమాదమే.. ఈ విషయాలను తెలుసుకోండి..
బ్రిటానికాలో ప్రచురించబడిన ఒక కథనం ప్రకారం యాపిల్ గింజలు ఆరోగ్యానికి హానికరం.. అవి శరీరంలో విషంగా పనిచేస్తాయి. కానీ కొన్నిసార్లు మనం యాపిల్ గింజలను తినేస్తుంటాం.. అవి శరీరంలో విషం మాదిరిగా పనిచేస్తుంది.
యాపిల్, బేరి, చెర్రీస్ వంటి జాతికి చెందిన ఇతర పండ్ల విత్తనాలలో సైనైడ్.. చక్కరతో కూడిన సైనోజెనిక్ గ్లైకోసైడ్ అయిన అమిగ్డాలిన్ ఉంటుంది. ఇది అతిగా తీసుకోవడం వలన శరీరంలో జీర్ణం కాదు.. ఈ రసాయనం విషపూరితమైన హైడ్రోజన్ సైనైడ్గా మారుతుంది. ఈ హైడ్రోజన్ సైనైడ్ కొన్ని నిమిషాల్లో మరణం కూడా సంభవించవచ్చు..
యాపిల్ తిని చనిపోవడం అనేది నిరూపితంకదు.. కానీ అందులోని విత్తనాలు విషంగా మారి శరీరానికి హాని కలిగించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ గింజలను నమలడం, చూర్ణం చేసినప్పుడు.. అమిగ్డాలిన్ పనిచేస్తుంది. కానీ ఆ గింజలు పగలకపోతే ప్రమాదం ఉండదు.
HCN యొక్క చిన్న మోతాదులో శరీరంలో ఎటువంటి సమస్య ఉండదు. కొన్ని విత్తనాలు ఎటువంటి సమస్యను కలిగించవు. నివేదిక ప్రకారం ఎవరైనా 150 కంటే ఎక్కువ విత్తనాలు తింటే సమస్యలు వస్తాయి. యాపిల్‌లో 4-5 ఉంటాయి.. ఎక్కువ గింజలు కావాలంటే కిలోల యాపిల్ గింజలు తినాల్సి ఉంటుంది. గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు.. నివేదికల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు.
యాపిల్ గింజలను తింటున్నారా ?.. జాగ్రత్త విషం కంటే డేంజర్..