Tirumala: తిరుమలలో మరో పుణ్యక్షేత్రం.. ఆకాశగంగలో అద్భుత కట్టడం…డిజైన్ మ్యాప్ రిలీజ్

|

Feb 09, 2022 | 10:53 AM

Tirumala: ఆంజనేయుడి జన్మస్థలం వివాదానికి టీటీడీ ఫుల్ స్టాప్ పెట్టబోతోంది. హనుమంతుడి బర్త్ ప్లేస్ పై ఏడాదికి పైగా జరిగిన రగడకు టీటీడీ(TTD) ముగింపు పలుకుతోంది. ఇందులో భాగంగానే తిరుమలగిరుల్లో మరో అధ్భుత కట్టడం రాబోతోంది. ఇందుకు ఈనెల 16ను ముహుర్తంగా నిర్ణయించిన టీటీడీ తిరుమలేశుడి సన్నిధి కొచ్చే భక్తులకు ఆంజనేయుడి జన్మస్థలంగా ఆకాశగంగ ప్రాంతాన్ని అధృత కళాసృష్టికి నిలయంగా మార్చబోతోంది.

1 / 11
ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సహకారంతో దాతల విరాళాలతో ఆంజనేయుడి జన్మవృత్తాంతం, స్థల పురాణం, పర్వత విశేషాన్ని ఆవిష్కరించబోతోంది. హనుమంతుడి జన్మస్థలంపై ఎన్నో వివాదాలు, అభ్యంతరాలకు దీంతో టీటీడీ తెరదించబోతోంది.

2 / 11
కర్నాటకలోని కిష్కింద పర్వతం హనుమంతుడి జన్మస్థలమని హంపికి చెందిన హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అభ్యంతరం, మహారాష్ట్రలోని మరో ప్రాంతమే హనుమాన్ బర్త్ ప్లేస్ అంటూ ఇలాంటి వివాదాలపై పెద్ద కసరత్తే చేసిన టీటీడీ ఎట్టకేలకు అంజనాద్రి పర్వతమే ఆంజనేయుడి జన్మస్థలమని తేల్చింది.

3 / 11
టీటీడీ ఎంతో మంది పండితులు, పీఠాధిపతులతోపాటు పురాణాలు, ఐతిహాలు, సదస్సు లను నిర్వహించి వ్యయ ప్రయాసలతో హనుమంతుడి జన్మస్థలం ఆకాశగంగ ప్రాంతంగా తేల్చింది. కర్నాటకకు చెందిన హనుమద్ క్షేత్ర ట్రస్టు లేఖలు ఆరోపణలను సీరియస్ గానే తీసుకుని కొంతమంది పండితుల చేత ఆంజినేయుడి జన్మస్థలం వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది.

4 / 11
ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారు కొలువైన ఏడుకొండల్లోని ఒకటైన అంజనాద్రి ఆంజనేయుడి జన్మస్థలంగా నిర్ధారించిన టీటీడీ ఈ ప్రాంతాన్ని హనుమంతుడి బర్త్ ప్లేస్ గా అభివృద్ధి చేస్తోంది. తిరుమలలోనే ఆంజనేయుడు పుట్టాడంటూ అనేక పురాణాలు, ఐతిహాలు, శాసనాలు, వాజ్మయ గ్రంధాలు, భౌగోళిక చారిత్రక ఆధారాలను బయట పెట్టింది. భక్తుల అనుమానాలను నివృత్తి చేసే పనిలో టీటీడీ కసరత్తు చేసింది.

5 / 11
నిష్ణాతులైన పండితుతో కమిటీని నియమించి అద్యయనం చేయించింది. ఈమేరకు పండిత పరిషత్ హనుమ జన్మస్థల నిర్ధారణకు వచ్చింది.  అనేకఆధారాలను సేకరించి గతేడాది శ్రీరామనవమిరోజున తిరుమలలోని నాద నీరాజనం వేదికగా హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రిగా నిర్ధారించింది. బ్రహ్మాండ పురాణంతోపాటు అనేక పౌరాణిక, పురాతన సాహిత్య గ్రంధాలను అన్వేషించి ఆధారాలతో హనుమంతుడి జన్మస్థల వివాదానికి తెరపడేలా నివేదికను సమర్పించింది.

6 / 11

ఈమేరకు ఇప్పటికే ఆకాశగంగ ప్రాంతంలో చేపట్టాల్సిన పనులకు ఈనెల 16న భూమి పూజ చేయనున్న టీటీడీ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయితో అద్భుత నిర్మాణాలను చేపట్టబోతుంది. తెలంగాణలోని యాదాద్రి సృష్టికర్త ఆనంద్ సాయి ఆంజినేయుడి జన్మస్థలం, భౌగోళిక పౌరాణిక శాస్త్రాల ఆధారంగా హనుమంతుడి జన్మస్థలంలో పుణ్యక్షేత్రాన్ని నిర్మించేలా డిజైన్లను తయారు చేసి టీటీడీ ఇంజనీరింగ్ విభాగానికి అందజేశారు.

7 / 11
 హనుమంతుడి జన్మస్థల వృత్తాంతంపై ఈ మేరకు అదే రోజు పుస్తకం విడుదల చేయనున్న టీటీడీ దాతల సాయంతో అంజనాదేవి, బాల ఆంజనేయస్వామి వారి ఆలయం, ఎదురుగా ముఖమండపం, రెండు గోపురాలు, సమీపంలో ధ్యాన మందిరం, ప్రవేశమార్గం, ఆలయం నుంచి బయటకు వచ్చే భక్తుల కోసం మరో మర్గాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్న టీటీడీ గోగర్భం డ్యాం ప్రాంతంలో రోటరీ నిర్మాణం చేపట్ట బోతోంది.

8 / 11
శేషాచలం అటవీ ప్రాంతంలోని పచ్చదనానికి ప్రకృతికి నష్టం వాటిల్ల కుండానే ఈ నిర్మాణాలను చేపట్టబోతున్న టీటీడీ పూర్తిగా దాతల విరాళాలతోనే ఆంజినేయుడి జన్మస్థలం నిర్మాణాన్ని తలపెట్టింది.

9 / 11
యాదాద్రి తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నిర్మాణం జరిగేలా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కళాసృష్టి తిరుమల కొండల్లో మరో అద్భుత శిల్ప సౌందర్యాన్ని ఆవిష్కరించబోతుండగా హనుమంతుడి జన్మస్థలంలో ఆవిష్కరించ బోయే నిర్మాణాలు, డిజైన్లపై టీటీడీ సంతృప్తి వ్యక్తం చేసింది.

10 / 11
ఇందులో భాగంగానే టీటీడీ ఈఓ జవహార్ రెడ్డి, అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి తోపాటు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి దాతలు ఆకాశగంగ ప్రాంతాన్ని పరిశీలించారు. 16న తిరుమల కొండల్లో మరో అద్భుత నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు సన్నద్ధమైన టీటీడీ దేశంలోని మఠాధిపతులు, పీఠాదిపతులకు కూడా ఆహ్వానం పలికింది.

11 / 11
11

11