
వంకాయ, పచ్చిమిర్చి రోటి పచ్చడిని ఆంధ్రాలో బాగా తింటారు. పాత కాలంలో అందరూ రోటి పచ్చళ్లను బాగా తినే వాళ్ళు. ఇప్పుడు అయితే రోటిలో నూరడమే మానేశారు రోకలి బండతో నూరి తింటే ఆ రుచే చాలా వేరు. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు : పావు కిలో వంకాయలు, నాలుగు పండు టమాటాలు, పచ్చి మిర్చి,6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు, 5 పచ్చి మిర్చి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.

ముందుగా వంకాయలను తీసుకుని వాటిని కడిగి క్లీన్ ఒక గిన్నె లేదా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చి మిర్చిని తీసుకుని కడిగి తేమ లేకుండా తుడిచి వాటిని బాగా ఆరబెట్టాలి

ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేసి, వంకాయలు టమాటాలు, పచ్చి మిర్చిని వేసి బాగా పాన్ లో బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత వీటిని తీసుకుని రోటిలో వేసుకుని బాగా దంచుకోవాలి.

ఇప్పుడు రోటిలో బాగా దంచుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేస్తే బాగా రుచిగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మిక్సీలో పట్టుకునే కన్నా రోటిలో నూరితే బాగా రుచిగా ఉంటుంది. అంతే, వేడి వేడి వంకాయ, పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ