
పిస్తాలో విటమిన్ E, విటమిన్ B6 వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పిస్తా పలుకుల్లో మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా గుండెను శక్తివంతంగా చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి.

పిస్తా పప్పు రోజూ తినడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రోటీన్ ఫైబర్ లభిస్తుంది. దీనివల్ల శరీర కండరాల నిర్మాణంలో మార్పులు రావడమే కాకుండా జీర్ణ క్రియ కూడా మెరుగు పడుతుంది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా కూడా శరీరాన్ని రక్షిస్తాయి. పిస్తాలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు.. చెడు కొలెస్ట్రాల్‌ను ఐస్‌లా కరిగించేలా చేస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా తయారవుతుంది.

పిస్తాపప్పులో శక్తివంతమైన ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపి శరీర బరువు నియంత్రణకు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే జీర్ణ క్రియను కూడా మెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది. సులభంగా బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా డైట్ లో భాగంగా పిస్తాను చేర్చుకోవడం మేలని డైటీషియన్లు చెబుతున్నారు.

పిస్తాలో క్యాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోజు వీటితో తయారుచేసిన పౌడర్ని పాలలో కలుపుకొని తాగడం వల్ల ఎముకలు ఉక్కులా తయారవుతాయి. దీని కారణంగా ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధిలు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

పిస్తా పలుకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఎంతగానో ప్రభావం చూపుతాయి. కాబట్టి రోజూ వీటిని తినడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా, మెరిసేలా అందంగా మారుతుంది. ముఖంపై మచ్చలు,ఇతర సమస్యలతో బాధపడేవారు ఈ పిస్తా పలుకులను రోజు తినవచ్చు.