
మగువలకు పుత్తడి అంటే మహా ఇష్టం. డబ్బు పొదుపు చేసి బంగారు, వెండి ఆభరణాలను కొనుగోలు చేసి, అందంగా అలంకరించుకుని మురిసిపోతుంది. బంగారు ఆభరణాలు అందాన్ని రెట్టింపు చేయడమేకాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

ఇన్ఫెక్షన్ నుంచి కాపాడడంలో బంగారు ఆభరణాలు ఎంతో ఉపయోగపడతాయి. మీకు బంగారు ఆభరణాలను ధరించే అలవాటు లేనట్లయితే వెంటనే అలంకరించుకోండి. ఇవి ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా మేనును ఎల్లప్పుడు కాపాడుతుంది.

బంగారం వేసవిలో శరీరాన్ని చల్లగా, చలి కాలంలో వెచ్చగా ఉంచుతుంది.

బంగారు ఆభరణాలు ధరించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంపై ఏదైనా గాయం తగిలితే, గాయం త్వరగా నయం అయ్యేలా బంగారం చేస్తుంది.

బంగారంలో చర్మాన్ని మెరుగుపరిచే అనేక ఖనిజాలు ఉంటాయి. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి బంగారు ఆభరణాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాకుండా నిద్ర సమయంలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.