
నువ్వులు, బెల్లంతో కలిపి తీసుకుంటే శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో పొటాషియం, సోడియం, ఐరన్ తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పిల్లల పోషణలో నువ్వులు, బెల్లం ప్రధాన పాత్ర పోషిస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవాలనుకుంటే, మీరు బెల్లం, నువ్వులను కలిపి తినాలి. ఈ పదార్థాలు మీ వంటగదిలో సులభంగా లభిస్తాయి. మీరు వాటిని వివిధ వంటకాల్లో కూడా ఉపయోగించవచ్చు.

వేయించిన నువ్వులు.. బెల్లం కలిపి తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతోంది. రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతోన్న వారు.. ఐరన్ తక్కువగా ఉన్నవారు ఒక చెంచా వేయించిన నువ్వులు,బెల్లం కలిపి తింటే మంచిది. రోజుకు ఒక చెంచా నువ్వులు,బెల్లం కలిపి తింటే బరువు తగ్గుతారు.

నువ్వులు,బెల్లం తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ త్వరగా తగ్గిపోతుంది.ఇది సహజంగా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. ప్రతిరోజు ఒకటి తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్, కాల్షియం లభిస్తుంది. చదువుకునే పిల్లలకు వీటిని పెడితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

నువ్వులు కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్లకు మంచి మూలం. అవి గుండె జబ్బులు, ఎముక వ్యాధి ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బెల్లం ఇనుముకు మంచి మూలం. ఇది రక్తహీనతకు సహాయపడుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది.

Sesame Seeds