
కూరగాయల్లో ఎన్నో రకాలు ఉంటాయి. కానీ అందరూ అన్నీ తినరు. కేవలం తమకు నచ్చినవి లేదా ఫేవరేట్ వెజిటేబుల్స్ మాత్రమే తీసుకుంటారు. మిగతా వాటి వైపు అస్సలు పట్టించుకోరు. ఇలా కూరగాయల్లో కంద కూడా ఒకటి. ఇది చాలా అరుదైన కూరగాయ. పూర్వం ఎక్కువగా దీన్ని తినేవారు. కాలక్రమేణా తినడం మానేస్తున్నారు.

కానీ ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఒక్క దుంప తింటే ఎన్నో వందల రకాల జబ్బులను తగ్గించుకోవచ్చు. చేజేతులా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కందను తరచూ తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కందలో మెండుగా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. చర్మం, జుట్టు, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి చాలా అవసరం. కంద తినడం వల్ల మెదడు పని తీరు కూడా మెరుగుపడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

కంద తింటే.. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. భయంకరమైన క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. కందలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి జీర్ణ సంబంధిత సమస్యలు అయినా తగ్గుతాయి.

విరేచనాల సమస్యతో బాధ పడుతున్నవారు కంద తింటే కంట్రోల్ అవుతాయి. వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇలా చాలానే ఉన్నాయి. అయితే కంద తినేటప్పుడు మాత్రం పెదవులకు అంటకుండా తినండి. లేదంటే దురదలు వస్తాయి.