1 / 6
బార్లీలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. బార్లీని గరిబోళ్ల సంజీవని అంటారు.. బార్లీ ఆరోగ్యానికి చాలామంచిది.. ఇది శరీరానికి ఎన్నో పోషకాలు అందించడంతోపాటు.. చల్లగా ఉంచుతుంది. బార్లీ నీరు రెగ్యులర్‌గా తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.. వాస్తవానికి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, కాలేయాన్ని నిర్విషీకరణ చేయడానికి చాలా మంది ఇప్పుడు డిటాక్స్ పానీయాలపై ఆధారపడుతున్నారు. ఇలాంటి వాటికి బార్లీ నీరు ఉత్తమం.. బార్లీ నీరు ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ వంటి పోషకాలతో నిండి ఉంటుంది. రెగ్యులర్ గా గ్యాస్-హార్ట్ బర్న్, డీహైడ్రేషన్ సమస్యలతో బాధపడేవారు ఈ బార్లీ నీటిని తాగవచ్చు.. ఇందులో ఫైబర్ ఉంటుంది.. ఇది మంచి జీర్ణ ఆరోగ్యాన్ని నిర్వహించడానికి, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. డీహైడ్రేషన్ తో బాధపడేవారికి బార్లీ నీరు సంజీవని లాంటిది.. వేడి వాతావరణంలో కూడా శరీరాన్ని చల్లగా ఉంచేందుకు ఈ డిటాక్స్ డ్రింక్ సహకరిస్తుంది. బార్లీ నీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోండి..