
రాగుల్లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్, ఫైబర్‌లు, కొవ్వులు, ప్రొటీన్‌ల వంటి అన్ని అవసరమైన స్థూలపోషకాలను కలిగి ఉంటుంది. రాగి జావను రోజూ తీసుకుంటే.. ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు.. ట్రిప్టోఫాన్, అమైనో ఆమ్లాలు, సహజ సడలింపుగా పని చేసి.. మీకు విశ్రాంతిని అందిస్తుంది.

రాగుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు ఎంతో మంచిది. రాగి జావ తాగితే వేసవిలో అలసట లేకుండా ఉంటారు. రాగి జావను ఉదయం బ్రేక్‌ఫాస్ట్ గా తీసుకుంటే ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రాగిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. రాగి జావ తాగితే ఎముకలు బలంగా ఉంటాయి.

వేసవిలో ఎక్కువగా చెమట పడుతుంది. దీంతో శరీరం డీహైడ్రేట్ అవుతుంది. రాగి జావ తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవకుండా ఉంటుంది. రాగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది మీ రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుతుంది. రాగి జావ రెగ్యులర్ గా తాగితే రాగుల్లో ఉండే పోషకాలు చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

రాగుల్లో శరీరాన్ని డీటాక్స్ చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. రాగి జావా తాగడం వల్ల ఇది శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. రాగి జావ చిన్నారుల కోసం చాలా మంచిది. పిల్లలు ఎండాకాలం అలసిపోకుండా తక్షణ శక్తి అందిస్తుంది. అలాగే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా కాపాడుకోవచ్చు.

క్రమం తప్పకుండా రాగులు తీసుకోవడం వల్ల విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు. రాగులలో పీచు పదార్థం, క్యాల్షియం అధికంగా ఉంటాయి. మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడేవారు రాగి జావ, మజ్జిగ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలా తీసుకుంటే ఎక్కువ పోషకాలు శరీరానికి అందుతాయి.