
ద్రాక్ష: ఈ పండులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని హైడ్రేటింగ్ లక్షణాలు వేసవి కాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అల్పాహారం కోసం లేదా ఎండలో బయటకు వెళ్లేటప్పుడు మీరు వీటిని మీతో తీసుకెళ్లవచ్చు.

దానిమ్మ: మీరు వేసవిలో ఇంటి నుంచి బయటకు వెళితే ఖచ్చితంగా దానిమ్మ గింజలను మీతో ఉంచుకోండి. ఐరన్ పుష్కలంగా ఉన్న దానిమ్మ పండు ఎర్ర రక్తకణాల ఏర్పాటుకు బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎండ నుంచి మనల్ని కాపాడతాయి.

నీరు: వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి తగినంతగా నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. బయటకు వెళ్లేటప్పుడు మీ బ్యాగ్‌లో నీటిని ఉంచుకోండి. మధ్య మధ్యలో కొద్దిగా నీరు తాగండి. ఇలా చేయడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. శక్తి కూడా ఉంటుంది. అలాగే మీరు తక్కువ అలసటతో ఉంటారు.

అరటిపండు: కాల్షియం, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండే అరటిపండు వేసవిలో శరీరాన్ని లోపలి నుంచి చల్లగా ఉంచుతుంది. జిమ్ లేదా వర్కౌట్స్ చేసే వ్యక్తులు ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండటానికి అల్పాహారంలో అరటిపండ్లను తీసుకుంటారు.

డార్క్ చాక్లెట్: డీహైడ్రేషన్ కాకుండా వేసవిలో శక్తి వృధా కారణంగా ప్రజలు తరచుగా అలసిపోతారు. శరీరంలో ఎనర్జీ మెయింటెయిన్ అవ్వాలంటే డార్క్ చాక్లెట్ తినాలని అంటున్నారు నిపుణులు. విశేషమేమిటంటే వీటిని తీసుకెళ్లడంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

summer