ఆవాల ఆకుల గురించి చాలా మందికి తెలిసినా మరికొంత మందికి వాటి గురించి తెలియకపోవచ్చు. వీటిని ఇంటి పెరటిలో కూడా సులభంగా పెంచుకోవచ్చు. వీటిని మైక్రో గీన్స్ అని కూడా అంటారు. ఇవి కూడా ఆకు కూరలే. వీటిని కూడా సాధారణ ఆకు కూరల్లో వండుకుని తినొచ్చు.
ఆవాల ఆకు కూరతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని.. చాలా సమస్యలకు చెక్ పెట్టొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆవాల ఆకు కూరలో యాంటీ ఆక్సిడెంట్లు, మైక్రో న్యూటియన్స్, విటమిన్ సి వంటివి మెండుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవాల ఆకు కూరను యాంటీ క్యాన్సర్ ఆకు అని కూడా పిలుస్తారు. దీన్ని క్రమం తప్పకుండా మీ డైట్‌లో చేర్చుకుంటే లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా మిమ్మల్ని రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా లంగ్ క్యాన్సర్‌తో బాధ పడేవారు కూడా వీటిని తింటే ఫలితం ఉంటుందంటున్నారు.
ఇతర క్యాన్సర్ కణాలు కూడా వ్యాప్తి చెందకుండా ఉంచుతుందని అంటున్నారు. ఆవాల ఆకు కూరను సలాడ్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఈ ఆకు కూర తీసుకోవడం వల్ల వాతావరణ మార్పుల వచ్చే ఇన్ ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూస్తుంది.
ఆవాల ఆకుల్లో ఉండే విటమిన్ కె.. గుండెను కాపాడుతుంది. ఎముకల్ని స్ట్రాంగ్‌గా చేస్తుంది. అదే విధంగా జీర్ణ సమస్యలు లేకుండా చూస్తుంది. సాధారణ వంటలు చేసుకున్నట్టే ఆవాల ఆకులను కూడా వండుకోవచ్చు.