
Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ పండుగ (మే 3)కు బంగారం కొనడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున ఆభరణాలు కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో.. పసిడి ఆభరణాలను అలంకరించుకుని భక్తి శ్రద్ధలతో పూజపునస్కారాల్లో నిమగ్నమవుతారు. ఈ పండుగకు ఏ విధమైన ఆభరణాలు అలంకరించుకోవాలో తెలుసుకుందాం..

అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి లేదా ఇతర మెటల్ బ్రేస్‌లెట్‌లను ధరించవచ్చు. ఇది క్లాసీ లుక్‌ని ఇస్తుంది.

అందంగా కనిపించడంలో చెవి కమ్మలు (Earrings) కూడా ముఖ్యమేనండోయ్! గోల్డ్ లేదా ఇతర మెటల్ ఇయర్ రింగ్స్‌లో డ్రాప్ డౌన్ డిజైన్, హూప్స్, స్టుడ్స్ వీటిల్లో ఏ డిజైన్ అయినా ఇట్టే నప్పుతాయి.

మహిళలు లెహంగా లేదా చీర వంటి దుస్తులు ధరించి నప్పుడు నుదుటిపై సరిగ్గా మ్యాచ్ అయ్యే పాపిట బిళ్ళ ను ఖచ్చితంగా ధరిస్తారు.

ఈ రోజుల్లో నెక్లెస్‌లను ధరించడం చాలా ట్రెండ్‌గా భావిస్తున్నారు. పడుచు ఆడపిల్లలు లెహంగా, చీరలతో వీటిని ధరించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. నెక్లెస్ మీకు అందమైన రూపాన్ని ఇస్తుంది.