Skincare: మెరిసే చర్మం కావాలా..? అయితే మీరు ఈ 5 ఆహారాలను తీసుకోవాల్సిందే.. అవేమిటంటే..

|

Sep 02, 2023 | 6:42 AM

Skincare Tips: మెరిసే కాంతివంతమైన చర్మాన్ని కోరుకోని వారు ఉండరు. అయితే అది మార్కెట్‌లోని కాస్మటిక్స్‌ని తెచ్చి వాడేసినంత తేలిక కాదు, అలా అని అంత ఖర్చు కూడా కాదు. ఆకర్షణీయమైన చర్మం కోసం ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తినే ఆహారంలో చర్మానికి ఉపయోగపడే పోషకాలు ఉండేలా శ్రద్ధ తీసుకోవాలి. అయితే చర్మం కోసం ఏయే ఆహారాలను తీసుకోవాలి, వాటినే ఎందుకు తీసుకోవాలి..? ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..

1 / 5
టమోటా: చర్మ సంరక్షణలో టమోటాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే టమోటాల్లో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్‌ని తొలగించడంతో పాటు సూర్యుని యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. టమోటా లైకోపీన్‌కి మంచి మూలం కూడా. వీటిని తినడం వల్ల ముఖంలో రక్త ప్రసరణ పెరిగి చర్మం మెరిసిపోతుంది.

2 / 5
కీర దోస: మెరిసే చర్మాన్ని కోరుకునేవారు తమ ఆహారంలో భాగంగా కీర దోసను తీసుకోవాలి. కీర దోసలో అధిక శాతం నీరు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వీటితో పాటు కొల్లాజెన్‌ని ఉత్పత్తి చేసే శక్తి కీర దోసలోని పోషకాలకు ఉంది. ఈ కారణంగానే మెరిసే చర్మం కోసం కీర దోసను తప్పనిసరిగా తినాలి.

3 / 5
పాలకూర: పాలకూరలోని పోషకాలు కూడా చర్మ సంరక్షణలో ఉపయోగపడతాయి. ఇందులోని విటమిన్ సి, ఐరన్, విటమిన్ ఇ పోషకాలు చర్మానికి మేలు చేయడంతో పాటు శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగిస్తాయి. పాలకూరలోని బీటా కెరోటిన్ చర్మం ఆరోగ్యం కోసం ఎంతో అవసరం.

4 / 5
దుంపలు: మెరిసే చర్మం కోసం మీరు క్యారెట్, బంగాళదుంప, కంద వంటి దుంపలను తీసుకోవచ్చు. వీటిల్లో ప్రొటీన్ ఎక్కువ మొత్తంలో ఉండడంతో పాటు చర్మానికి మేలు చేసే పోషకాలు ఉంటాయి. దుంపల్లోని యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ చర్మం మెరిసేలా చేస్తాయి.

5 / 5
క్యాప్సికమ్: క్యాప్సికమ్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం మెరిసేలా చేయడంతో పాటు, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. అలాగే ముఖంపై ముడతలు తొలగిపోతాయి.