Heart Health: గుప్పెడంత గుండె ఆరోగ్యం కోసం తప్పక తినాల్సిన 5 ఆహారాలు.. లిస్టులో ఏమేం ఉన్నాయంటే..?
Heart Health: ప్రస్తుత కాలంలో మానవాళిని వేధిస్తున్న ప్రధాన సమస్య గుండెపోటు. ఉదయం నవ్వుతూ ఉన్నవారు సాయంత్రానికి ఎలా ఉంటారో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో గుండెపోటు బారి నుంచి బయట పడేందుకు తినే ఆహారంలో కొన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఇక గుండె ఆరోగ్యాన్ని కాపాడే పోషకాల్లో మెగ్నిషియం, పొటాషియం, ఫొలేట్, ఫైబర్‌తో పాటు ఒమెగా 3 కూడా ఎంతో అవసరం. అంటే ఒమెగా 3 లభించే ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా గుండె ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఈ పోషకం కోసం ఏయే ఆహాారాలను తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..