
ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్లలో రష్మిక ఒకరు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లోనూ ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేస్తోంది.

కాగా సినిమా షూటింగులతో బిజీబిజీగా ఉండే రష్మిక తాజాగా తన స్నేహితురాలి పెళ్లిలో సందడి చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

తమిళనాడులోని కొడగులో ఈ పెళ్లి జరిగింది. రష్మిక కుటుంబ సభ్యులు కూడా ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

కాగా సంప్రదాయ దుస్తులు ధరించి తన స్నేహితురాలితో కలిసి రష్మిక దిగిన ఫొటోలు అభిమానులు, నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో షేర్ చేసిన రష్మిక తన స్నేహితురాలికి విషెస్ చెప్పింది

త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పుష్ప2 షూటింగ్ లో జాయిన్ కానుంది.