Kitchen Hacks: నల్లగా మారిన టీ చిక్కాన్ని ఇలా క్లీన్ చేస్తే తెల్లగా మెరిసిపోతుంది..

Updated on: Jan 28, 2025 | 2:29 PM

ఇంట్లో ఉండే వాటితో ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చు. కిచెన్‌లో తరచూ ఉపయోగించే వాటిల్లో టీ ఫిల్టర్ కూడా ఒకటి. రోజూ ఉపయోగించడం వల్ల నల్లగా మారుతుంది. కానీ ఈ చిట్కాలతో నల్లగా మారిన టీ చిక్కాన్ని.. తెల్లగా మార్చుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో చూసేయండి..

1 / 5
మనం నిత్యం ప్రతి రోజూ ఉపయోగించే వాటిల్లో టీ చిక్కం కూడా ఒకటి. దీన్నే టీ జాలీ అని కూడా పిలుస్తారు. ఉదయం లేవగానే టీ తాగపోతే.. ఏ పనీ మొదలు కాదు. రోజూ ఉపయోగించడం వల్ల టీ జాలి నల్లగా మారిపోతుంది. దీంతో పాతవి పడేసి కొత్తవి కొంటూ ఉంటారు. అలా కాకుండా ఇలా క్లీన్ చేస్తే.. మళ్లీ కొత్తదానిలా మెరిసిపోతుంది.

2 / 5
టీ చిక్కాన్ని రోజూ క్లీన్ చేసే విధంగా కాకుండా.. ఈ సారి ఇలా క్టీన్ చేయండి. వేడి నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా వెనిగర్ వేయండి. ఇందులో కాసేపు టీ జాలిని ఉంచి.. ఆ తర్వాత స్క్రబ్బర్‌తో రుద్దితే ఈజీగా మురికి పోతుంది.

3 / 5
నిమ్మ చెక్కతో కూడా టీ చిక్కాన్ని కొత్తగా మెరిపించవచ్చు. వేడి నీటిలో టీ జాలిని నానబెట్టాలి. నిమ్మకాయ రసం పిండాక తొక్కలు పడేయకుండా వాటితో టీ చిక్కాన్ని రుద్దండి. అంతే తెల్లగా మెరుస్తుంది టీ జాలి.

4 / 5
బేకింగ్ సోడాతో ఎలాంటి మురికిని, నలుపును అయినా పోగొట్టవచ్చు. వేడి నీటిలో కొద్దిగా డిటర్జెంట్, బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసి అందులో టీ చిక్కాన్ని వేసి నానబెట్టండి. దీన్ని స్క్రబ్బర్‌తో రుద్దితే మురికి అంతా పోతుంది.

5 / 5
ఈ చిట్కా  కూడా చక్కగా పని చేస్తుంది. ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకుని అందులో టీ జాలిని నానబెట్టండి. కాసేపటి తర్వాత తీసి.. డిష్ వాష్‌ సోప్‌ ఉపయోగించి స్క్రబ్బర్‌తో రుద్దితే మురికి పోతుంది.