హైపర్‌కాల్సెమియా.. మీ రక్తంలో కాల్షియం స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. నాలుగు చిన్న గ్రంధులలో ఒకటి (పారాథైరాయిడ్ గ్రంధి) లేదా క్యాన్సర్ వల్ల హైపర్‌కాల్సెమియా తరచుగా సంభవిస్తుంది. హైపర్‌కాల్సెమియా లక్షణాలు తేలికపాటి నుంచి తీవ్రంగా ఉంటాయి. ఇందులో దాహం, మూత్రవిసర్జన పెరగడం, కడుపు నొప్పి, వికారం, ఎముకల నొప్పి, కండరాల బలహీనత, అలసట ఉంటాయి.