చాలా మంది బీర్ తాగుతూ ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వాటిని తింటారు. కానీ అలా తినడం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి.
మసాలా పదార్థాలను కూడా బీరుతో కలిపి తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల మీకు దీర్ఘకాలిక ఆరోగ్య నష్టం జరగవచ్చు. ఇంకా గుండెల్లో మంట, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి.
చాలా మంది బీర్‌తో పాటు ఉప్పశెనగులు లేదా వేరుశెనగలను స్టఫ్‌గా తింటారు. కానీ అలా చేయడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
బీరుతో స్వీట్లను ఎప్పుడూ తినకూడదు. ఇలా తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. స్వీట్లు తినాలంటే.. బీర్ తాగిన సమయానికి, స్వీట్లు తినడానికి మధ్య కనీసం 2 గంటల గ్యాప్ ఉండాలి.
అలాగే బీర్ తాగిన 2 గంటల వరకు బ్రెడ్ లేదా బ్రెడ్ ఉత్పత్తులను తినకూడదు. ఈ కాంబినేషన్‌లో ఆహారం తీసుకోవడం వల్ల మీకు జీర్ణ సమస్యలు వస్తాయి. ఇంకా జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది.