
శరీరాన్ని వెచ్చగా..: మీరు తరచుగా చలిగా అనిపిస్తుంటే.. రోజూ ఒక చిన్న బెల్లం ముక్క తినడం అలవాటు చేసుకోండి. శీతాకాలంలో బెల్లం తినడం ప్రారంభిస్తే, అది మీ శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది శీతాకాలపు అనారోగ్యాలను నివారించడంలో కూడా తోడ్పడుతుంది.

శరీరంలో రక్తాన్ని పెంచుతుంది: బెల్లం ఐరన్, వివిధ ముఖ్య ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. అందుకే బెల్లాన్ని రక్తహీనతతో బాధపడేవారు తప్పనిసరిగా తినాలి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన శరీరంలో రక్త ఉత్పత్తి మెరుగుపడుతుంది.

జీర్ణక్రియను మెరుగు: శీతాకాలంలో లేదా భారీ ఆహారం తిన్న తర్వాత కడుపులో భారంగా అనిపించడం సర్వసాధారణం. ఈ సమస్య ఉన్నవారు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం అలవాటు చేసుకోవాలి. బెల్లం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మీకు గ్యాస్, మలబద్ధకం సమస్యలు ఉంటే, బెల్లం తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

Jaggery

అందంగా చేస్తుంది: బెల్లాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మీ రక్తం శుద్ధి అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మొటిమలు నివారించడంతో పాటు మీ చర్మం మెరుస్తుంది. మీ జుట్టు బలంగా మారుతుంది. కాబట్టి పోషకాల కోసం చక్కెర స్థానంలో బెల్లాన్ని ఉపయోగించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.