
జీర్ణక్రియ: పెరుగు అంటేనే కోట్లాది మంచి బ్యాక్టీరియాకు నిలయం. ఈ బ్యాక్టీరియా మీ కడుపును, పేగులను క్లీన్‌గా ఉంచుతుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. కడుపు ఎప్పుడూ తేలికగా ఉంటుంది.

ఎముకలకు బలం: పెరుగులో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు ఎముకలు, దంతాలను బలంగా మారుస్తాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆస్టియోపోరోసిస్ ఎముకలు గుల్లబారడం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

curd

గుండెకు కూల్ ట్రీట్‌మెంట్: పెరుగు బీపీని కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. రెగ్యులర్‌గా పెరుగు తినేవారికి గుండెపోటు, స్ట్రోక్ లాంటి పెద్ద జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

చర్మానికి గ్లో ఎఫెక్ట్: పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మానికి చాలా మంచిది. ఇది చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేసి, డ్రై అవ్వకుండా కాపాడుతుంది. ఫలితంగా మీ చర్మం మరింత ప్రకాశవంతంగా మారుతుంది. పెరుగు కేవలం భోజనం చివరిలో తినే వంటకం కాదు.. ఇది మీ రోజువారీ ఆరోగ్యానికి ఒక బెస్ట్ ఫ్రెండ్ అందుకే రోజూ ఒక కప్పు పెరుగు తప్పనిసరిగా తీసుకోండి.