
ఇరాన్ - అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచం మొత్తం ఇంధన సంక్షోభాన్ని సృష్టించింది. దీని కారణంగా భారత్‌లోనూ పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. పాకిస్థాన్‌లో పెట్రోల్ ఖరీదైపోయింది. దీంతో ఆ దేశం ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించింది. కానీ ఒక దేశం ఉంది. అక్కడ ఒక లీటరు పెట్రోల్ కేవలం మూడు రూపాయలకే లభిస్తుంది. ఆ దేశం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

మరోవైపు దేశీయ గ్యాస్ సిలిండర్ల ధర కూడా పెరిగింది. సిలిండర్లు సకాలంలో సరఫరా కావడం లేదు. పాకిస్తాన్‌లో పెట్రోల్ చాలా ఖరీదైనదిగా మారింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో డీజిల్ ధర 54.9 శాతం పెరిగి లీటరుకు రూ. 520.35కు చేరింది. పెట్రోల్ ధర 42.7 శాతం పెరిగి లీటరుకు రూ. 458.40కు చేరింది.

యూరప్‌లో కూడా దేశాలను బట్టి పెట్రోల్ ధరలు చాలా తేడాగా ఉంటాయి. డెన్మార్క్‌లో పెట్రోల్ ధర $2.66 (రూ. 247.25), సింగపూర్‌లో పెట్రోల్ ధర $2.54 (రూ. 236.1), జర్మనీలో లీటరు పెట్రోల్ ధర $2.42 (రూ. 224.95)గా ఉన్నాయి.

ప్రపంచంలో అత్యంత చౌకైన పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది అనే ప్రశ్నకు సమాధానం ఇరాన్. ఇరాన్‌లో పెట్రోల్ అత్యంత చౌకగా లభిస్తుంది. ఇరాన్‌లో ఒక లీటర్ పెట్రోల్ ధర $0.029. అంటే మన కరెన్సీలో సుమారుగా రూ. 2.69కి సమానం. ఇరాన్‌లో పెట్రోల్ భారీ పరిమాణంలో ఉత్పత్తి అవుతుంది.

ఇరాన్‌తో యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. అలాగే వెనిజులాలో పెట్రోల్ కూడా చాలా చౌకగా లభిస్తుంది. ఇక్కడ ఒక లీటరు పెట్రోల్ ధర $0.035. అంటే రూ. 2.70 మాత్రమే.