India: భారత్ పౌరసత్వం వదులుకుంటున్న లక్షలాది మంది ఎన్నారైలు.. కారణం ఇదే..!

|

Jul 22, 2023 | 12:14 PM

భారత్ నుంచి పౌరసత్వాన్ని వదులుకనేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత పన్నెండున్నర ఏళ్లలో దాదాపు 17,50,466 మంది ఇండియా నుంచి తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ అన్నారు.

1 / 5

2 / 5
ఇందులో 2014 నాటి నుంచి 13,75,319 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. వీళ్లందరూ కూడా ప్రపంచంలోని దాదాపు 135 దేశాల పౌరసత్వాన్ని స్వీకరించినట్లు మంత్రి తెలిపారు. శుక్రవారం నాడు లోక్ సభలో కాంగ్రెస్ సభ్యుడు కార్తి చిదంబరం అడిని ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

3 / 5
ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత సిటీజన్‌షిప్ వదులుకనే వారి సంఖ్య గణనీయంగా పెరిగనట్లు గుణంకాల ద్వారా వెల్లడైంది. ఈ లెక్కలు పరిశీలిస్తే ఏడాదికి 1.40 లక్షల మంది.. ఒక రోజుకు 384 మంది భారత్‌తో తమ బంధాన్ని తెంచుకుని ఇతర దేశాల పౌరసత్వాన్ని స్వీకరిస్తున్నట్లు తేలింది.

4 / 5
ఇండియన్స్ ఉద్యోగ రిత్యా ప్రపంచవ్యాప్తంగా విదేశాలకు వెళ్లడం 20 ఏళ్ల నుంచి పెరుగుతూ వస్తోంది. చాలామంది తమ వ్యక్తిగత అవసరాలు, సౌకర్యం, సదుపాయాల కోసం ఇతర దేశాల పౌరసత్వం తీసుకునేందుకు ఆసక్తి చూపారు. మరోవైపు భారతీయుల మేధస్సును దేశంలోనే వినియోగించేందుకు కేంద్రం మేకిన్ ఇండియా లాంటి చర్యలు చేపట్టింది.

5 / 5
అదేవిధంగా దేశంలో ప్రజల నైపుణ్యాలు, స్టా్ర్టప్‌లను ప్రోత్సహిస్తున్నామని మంత్రి జై శంకర్ అన్నారు. విదేశాల్లో ఉన్న ఇండియన్స్ కూడా మనకు ఆస్తి లాంటి వారన్నారు. వారితో సంప్రదింపులు చేసేందుకు ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చిందని చెప్పారు. అలాగే భారత అభివృద్ధికి ఉపయోగపడే జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని ఇచ్చిపుచ్చుకునే విధానాన్ని సైతం కేంద్రం ప్రోత్సహిస్తోందని వెల్లడించారు.