అట్టహాసంగా 14వ డబ్ల్యూఎంసీ సమావేశం ప్రారంభం.. ఒక్క చోటే మలయాళీలంతా ఏకతాటిపైకి

Updated on: Jul 26, 2025 | 12:28 PM

ప్రపంచవ్యాప్తంగా మలయాళీ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో, ప్రపంచవ్యాప్తంగా మలయాళీల ఐక్యత, సంస్కృతి, సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో WMC ఒక చోదక శక్తిగా ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై ఒక లుక్కేయండి మరి. ఇదిగో ఇది చదివేయండి ఇలా..

1 / 7
ప్రపంచ మలయాళీ కౌన్సిల్(WMC) 14వ ద్వైవార్షిక సమావేశం గురువారం బ్యాంకాక్‌లోని రాయల్ ఆర్చిడ్ షెరాటన్ హోటల్‌లో గ్రాండ్ క్రూయిజ్ డిన్నర్‌తో ప్రారంభమైంది.

2 / 7
ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతాలలోని 70 ప్రావిన్సుల నుంచి రికార్డు స్థాయిలో 565 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మలయాళీ సంస్కృతి, వారి గౌరవం, ప్రపంచ స్ఫూర్తిని పండుగగా జరుపుకునేలా ఈ వేడుక సిద్దమయ్యింది.

3 / 7
ఈ సమావేశంలో గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, గ్లోబల్ జనరల్ కౌన్సిల్‌కి సంబంధించిన ముఖ్యమైన మీటింగ్స్‌తో పాటు కొత్త గ్లోబల్ ఆఫీస్ చీఫ్‌ల ఎన్నిక, ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఉంటాయి.

4 / 7
ఈ సమావేశం WMC చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి, ఇది దాదాపు అన్ని దేశాలలో మలయాళీల ఉనికిని ప్రతిబింబిస్తుంది అని గ్లోబల్ సెక్రటరీ జనరల్ దినేష్ నాయర్ అన్నారు.

5 / 7
"ప్రపంచవ్యాప్తంగా మలయాళీ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో, ప్రపంచవ్యాప్తంగా మలయాళీల ఐక్యత, సంస్కృతి, సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో WMC ఒక చోదక శక్తిగా ఉంది" అని గ్లోబల్ అధ్యక్షుడు థామస్ మోటకల్ అన్నారు.

6 / 7
ఈ సమావేశం మలయాళీ సమాజం గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ప్రదర్శిస్తుందని.. ప్రతినిధులు ఆలోచనలు, అనుభవాలను పంచుకోవడానికి ఒక వేదికను అందిస్తుందని భావిస్తున్నట్టు గ్లోబల్ ట్రెజరర్ షాజీ మాథ్యూ అన్నారు.

7 / 7
 గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు, మేధోపరమైన చర్చలు, నెట్‌వర్కింగ్ అవకాశాలతో, WMC గ్లోబల్ కాన్ఫరెన్స్ 2025 హాజరైన వారందరికీ మరపురాని అనుభవంగా ఉంటుందని హామీ ఇస్తున్నారు.