
మంగళగిరి మండలం నవులూరులో భారీ కార్తికేయ విగ్రహా నిర్మాణం జరుగుతుంది. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఈ విగ్రహాన్ని స్థానికులు నిర్మిస్తున్నారు. 123 అడుగుల ఎత్తులో నిర్మితమవుతన్న విగ్రహాం అందరిని ఆకట్టుకుంటుంది.

స్థానికులు దాతల సాయంతో గత కొంతకాలంగా నిర్మాణం కొనసాగిస్తున్నారు. కేవలం విగ్రహామే కాకుండా విగ్రహం చుట్టూ నాలుగు అంతస్తులో ప్రాకారం నిర్మాణం చేశారు. విగ్రహం ముందు ఆలయ నిర్మాణం కూడా జరగుతుంది. నవులూరు గ్రామం నుండే అమరావతి రాజధాని ప్రారంభమవుతుంది.

గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారి సాయం అందించడంతో స్థానికులు విగ్రహ నిర్మానం చేపట్టారు. మంగళగిరి నుండి నవులూరు మీదుగా రాజధానిలోకి వెళ్లే మార్గంలో ఈ విగ్రహాన్ని పది సెంట్ల స్థలంలో నిర్మిస్తున్నారు. అమరావతి రాజధానిలో మరో భారీ విగ్రహాంగా కార్తికేయ విగ్రహాన్ని అభివర్ణిస్తున్నారు.

మంగళగిరి నుండే కాకుండా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నుండి కూడా పదకొండు కిలో మీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఇప్పటికే వెంకటపాలెం టిటిడి ఆలయం నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇప్పుడు సుబ్రమణ్య స్వామి ఆయల నిర్మాణం కూడా పూర్తయితే ఆధ్యాత్మిక శోభ మరింతగా పరిఢవిల్లనుంది.

త్వరలోనే విగ్రహాంతో పాటు ఆలయాన్ని కూడా నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. కార్తికేయ విగ్రహానికి అత్యంత సమీపంలో రాజధాని నుండి జాతీయ రహదారికి కనెక్ట్ అయ్యే ఈ 13 రోడ్డు మార్గం వెలుతుంది. ఒకసారి ఈ మార్గం అందుబాటులోకి వస్తే కార్తికేయ విగ్రహానికి కూడా భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ విగ్రహాం భక్తులను, చూపరులను ఆకట్టుకుంటుంది.