కన్నడ డింపుల్ క్వీన్ రచితా రామ్‌కు అక్టోబర్ 3న పుట్టినరోజు వేడుకల్లో అనూహ్య ఘటన ఎదురైంది. అభిమానులతో సెల్ఫీలు దిగుతున్న సమయంలో ఓ యువకుడు ఆమె బుగ్గలు గిల్లాడు. ఈ షాకింగ్ సంఘటనను రచితా రామ్ నవ్వుతూ, హుందాగా ఎదుర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా, ఆమె ప్రవర్తనపై ప్రశంసలు దక్కుతున్నాయి.