వాహనదారులకు భారీ షాక్.. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

వాహనదారులకు భారీ షాక్‌ ఇస్తోంది ఢిల్లీ సర్కార్. గత 40 నుంచి 50 రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు అకస్మాత్తుగా భారీగా పెరిగాయి.ప్రస్తుతం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధరపై రూ.1.67 పెరిగింది. అటు లీటర్‌ డీజిల్‌పై ఏకంగా రూ.7.10 పెరిగింది. దీనికి ప్రధాన కారణం.. ఢిల్లీ సర్కార్.. పెట్రోల్‌,డీజిల్‌ ధరలపై వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)‌ను పెంచడమే. కేజ్రీవాల్‌ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో.. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.69.59 […]

వాహనదారులకు భారీ షాక్.. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!
Follow us

| Edited By:

Updated on: May 05, 2020 | 8:38 PM

వాహనదారులకు భారీ షాక్‌ ఇస్తోంది ఢిల్లీ సర్కార్. గత 40 నుంచి 50 రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు అకస్మాత్తుగా భారీగా పెరిగాయి.ప్రస్తుతం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధరపై రూ.1.67 పెరిగింది. అటు లీటర్‌ డీజిల్‌పై ఏకంగా రూ.7.10 పెరిగింది. దీనికి ప్రధాన కారణం.. ఢిల్లీ సర్కార్.. పెట్రోల్‌,డీజిల్‌ ధరలపై వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)‌ను పెంచడమే.

కేజ్రీవాల్‌ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో.. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.69.59 నుంచి రూ.71.26కి పెరిగింది. ఇక డీజిల్ ధర కూడా లీటరుకు రూ.62.29 ఉండగా.. పెంచిన వ్యాట్‌తో రూ.69.39కి చేరింది. పెట్రోల్‌,డీజిల్‌పై తాజాగా ముప్పై శాతం వ్యాట్‌ను పెంచింది. ఇంతకు ముందు పెట్రోల్‌పై 27 శాతం ఉండేది. ఇక డీజిల్‌పై 16.75 శాతం ఉండేది. ప్రస్తుతం ఇటు పెట్రోల్‌, అటు డీజిల్‌ రెండింటిపై ఇప్పుడు ముప్పై శాతంగా అవ్వడంతో.. ధరలు ఇంతలా పెరిగాయి.

కాగా, ఇప్పటికే గత నెలలో అసోం రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వ్యాట్‌ పెంచింది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. క్రమక్రమంగా అన్ని రాష్ట్రాలు కూడా పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ పెంచే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో