యుద్దమంటూ వస్తే.. ప్రపంచపటంలో పాక్ ఉండదుః కిషన్ రెడ్డి

War Will Wipe Out Pakistan From World Map Says Kishan Reddy, యుద్దమంటూ వస్తే.. ప్రపంచపటంలో పాక్ ఉండదుః కిషన్ రెడ్డి

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ప్రధాని మోదీ రద్దు చేసిన దగ్గర నుంచి దాయాది పాకిస్థాన్ రగిలిపోతోంది. తన వక్ర బుద్ధిని చూపిస్తూ దేశ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. ఈ తరుణంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పాకిస్థాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి యుద్దమంటూ వస్తే ప్రపంచపటంలో పాకిస్థాన్ అనే దేశం కనిపించదని ఆయన అన్నారు. రావాల్సిన సమయం వస్తే పీవోకే సంగతి కూడా తేల్చేస్తామన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై ఆదివారం కాకినాడలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో జరిగిన అవగాహన సదస్సులో కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

జవహర్‌లాల్ నెహ్రు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టికల్ 370ని ఏర్పాటు చేశారని.. దాని వల్ల 42 వేల మంది ఉగ్రవాదానికి బలయ్యారని కిషన్ రెడ్డి తెలిపారు. గతంలో ఆర్టికల్ 370 కారణంగా పాకిస్థాన్‌తో 4 యుద్దాలు జరిగాయన్నారు. ఉగ్రవాదం కారణంగా కశ్మీర్‌లో ఎన్నో దారుణాలు జరుగుతుంటే కమ్యూనిస్ట్, కాంగ్రెస్ నాయకులెవరూ ఎందుకని మాట్లాడటం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈసారి యుద్ధమొస్తే.. పాకిస్థాన్ ప్రపంచపటంలో లేకుండా చేస్తామన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఇమ్రాన్ ఖాన్ తాటాకుచప్పుళ్లకు తాము భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *