పాక్‌లో హిందువులకు రక్షణ లేదా? .. అక్కడేం జరుగుతుంది?

ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై పాకిస్థాన్ పీకల్లోతు కసితో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. జమ్ము కశ్మీర్‌లో మానవ హక్కులకు విఘాతం కలుగుతుందని, అక్కడి ప్రజల్నీ భారత ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెడుతోందంటూ ప్రపంచ దేశాల ముందు గగ్గోలు పెడుతోంది. అయితే ఇన్ని నీతి కబుర్లు చెబుతున్న పాక్‌లో మాత్రం అక్కడ నివసిస్తున్న హిందువుల రక్షణ ఇప్పడు ప్రశ్నార్ధకంగా మారింది. ఈవారం మొదట్లో నమ్రితా చాందినీ అనే మెడికల్ స్టూడెంట్ తన హాస్టల్ గదిలో మరణించడం అక్కడ […]

పాక్‌లో హిందువులకు రక్షణ లేదా? .. అక్కడేం జరుగుతుంది?
Follow us

| Edited By:

Updated on: Sep 21, 2019 | 4:10 PM

ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై పాకిస్థాన్ పీకల్లోతు కసితో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. జమ్ము కశ్మీర్‌లో మానవ హక్కులకు విఘాతం కలుగుతుందని, అక్కడి ప్రజల్నీ భారత ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెడుతోందంటూ ప్రపంచ దేశాల ముందు గగ్గోలు పెడుతోంది. అయితే ఇన్ని నీతి కబుర్లు చెబుతున్న పాక్‌లో మాత్రం అక్కడ నివసిస్తున్న హిందువుల రక్షణ ఇప్పడు ప్రశ్నార్ధకంగా మారింది.

ఈవారం మొదట్లో నమ్రితా చాందినీ అనే మెడికల్ స్టూడెంట్ తన హాస్టల్ గదిలో మరణించడం అక్కడ హిందువులపై జరుగుతున్న వేధింపులకు ఒక ఉదాహరణగా నిలిచింది. నమ్రితా చాందినీ అనే యువతి లార్కానా లోని అసిఫా డెంటల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఆమె తన హాస్టల్ గదిలో మృతి చెంది కనిపించడం ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది. నమ్రితాను ఆమె హాస్టల్ గదిలో కేబుల్ వైరుతో చంపి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే ఆమెను కావాలనే హత్య చేశారని తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో పాక్‌లోని సింధ్ కోర్టు న్యాయ విచారణకు ఆదేశించింది. ఇటీవల ఘట్కీ ప్రాంతంలో ఓ స్కూల్ ప్రిన్సిపాల్‌పై దాడి చేసిన ఘటన మరిచిపోకముందే ఇప్పుడు ఏకంగా ఓ స్టూడెంట్ మృతి చెందడం సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌పై దాడికి వ్యతిరేకంగా నమ్రితా కుటుంబం కూడా ఆందోళనలో పాల్గొంది.

పాక్‌లో మత,భాషాపరమైన అత్యాచారాలు జరగడం ఇప్పుడు కొత్తేమీ కాదు. ఈ దారుణాలు 1947 నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్‌లో హిందూ మతస్తులు మైనార్టీలుగా ఉన్నారు. దీంతో వీరిపై అప్పటినుంచి దారుణ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. స్వాతంత్రం తర్వాత భారత్‌లో అన్ని మతాలు స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వంతో ముందుకు సాగుతున్నాయి. ఇక్కడి రాజ్యాంగం అందరికీ అన్ని హక్కులు కల్పించింది. ముఖ్యంగా మైనార్టీలకు భారత్‌లో ఉన్న స్వేచ్ఛ మరెక్కడా లభించదేమో. కానీ పాక్‌లో అలా కాదు.. భారత్ నుంచి విడిపోయిన తర్వాత పాక్ ప్రత్యేక దేశంగా ఏర్పడి ముస్లిం మెజారిటీతో ఏర్పడింది. అయితే అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న హిందువులు మైనార్టీలుగా మారిపోయారు. ఆ తర్వాత వీరిపై మతం, భాష అంటూ ఎన్నో విధాలుగా అరాచకాలు, దమనకాండలు జరుగుతూనే ఉన్నాయి.

ఒక ప్రత్యేకమైన దేశంగా ఏర్పడిన తర్వాత పాకిస్తాన్ కూడా మన దేశం లాగే ఒక రాజ్యాంగం ఉండి ఉంటే అక్కడ వివిధ జాతుల వారికి అన్ని హక్కులు లభించేవి. కానీ అలా లేకపోవడం దురదృష్టకరమే. అక్కడ నివసిస్తున్న దాదాపు 45 లక్షల మంది హిందువులు వీరి కుట్రలకు, హింసలకు తమ జీవితాలను కొనసాగించలేకపోతున్నారని అంతర్జాతీయ మానవ హక్కుల కార్యకర్తలు సైతం పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఉదాహణగా ఇప్పటికే అక్కడున్న హిందూ ఆలయాలు, తీర్ధ స్థలాలు, చరిత్రకు ఆనవాళ్లుగా మిగిలిన ఎన్నో విద్యాలయాలు అంతరించిపోయాయి. కొన్ని జీర్ణావస్థకు చేరుకున్నాయి. తాజాగా హిందువుల ఇళ్లు, దుకాణాలపై జరుగుతున్న దాడులే ప్రత్యక్ష నిదర్శనాలు. తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్‌ల నుంచి తరిమివేతకు గురైన హిందువులను భారతీయ పౌరులుగా గుర్తించడానికి వీలయిన బిల్లును భారత ప్రభుత్వం రూపొందించింది. ఈ బిల్లును దేశంలోని అన్ని రాజకీయ పక్షాలవారు సమర్ధించాల్సిన అవసరం ఉంది.

అసలు పాకిస్థాన్ వంటి దేశాల్లో మైనార్టీలకు రక్షణ కల్పించడానికి అంతర్జాతీయ సమాజం ముందుకు రావాల్సిన అవసం ఉంది. దక్షిణాఫ్రికా వంటిచోట్ల వర్ణ వివక్ష రహితమైన రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటుచేయించడానికి అంతర్జాతీయ సమాజం చేసిన కృషి విజయవంతంగా ఫలించింది. అదే విధంగా పాక్‌లో కూడా అటువంటి రాజ్యాంగం ఏర్పడటానికి కృషి చేయాలి. అప్పుడే మైనార్టీలైన హిందువులకు కొంతలో కొంతయినా రక్షణ ఏర్పడుతుంది.

పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే పాక్‌లో ఉన్న దాదాపు 45 లక్షల మంది హిందువుల్లో కనీసం మూడో వంతు తమను హిందువులుగా నమోదు చేసుకునేందుకు భయపడుతున్నారు. ఎందుకంటే వీరిని జిహాదీ సంస్ధలు గుర్తించి వీరిపై సాగించే అత్యాచారాలకు భయపడటమే అసలు కారణం. అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులను ప్రపంచ దేశాలు ఖండించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా పాక్‌లో అన్ని మైనార్టీలకు రక్షణగా నిలిచే రాజ్యాంగాన్ని రూపొందించేందుకు కృషి జరగాలి.. అందుకోసం కూడా అంతర్జాతీయ సమాజం ఆలోచన చేయాలి. దీనికి భారత్ ముందుండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో