పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌కు ముచ్చెమటలు పట్టాయి! కాళ్లు చేతులు వణికాయి.!!

పైకి గాంభీర్యం ఒలకబోస్తుంటుంది కానీ పాకిస్తాన్‌కు భారత్‌ అంటే దడే...! గత ఏడాది పాకిస్తాన్‌తో జరిగిన వైమానిక పోరులో భారతీయ వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ శత్రువులను తరిమికొడుతూ పాక్‌ భూభాగంలోకి దిగిన వైనం,

పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌కు ముచ్చెమటలు పట్టాయి! కాళ్లు చేతులు వణికాయి.!!
Follow us

|

Updated on: Oct 29, 2020 | 1:52 PM

పైకి గాంభీర్యం ఒలకబోస్తుంటుంది కానీ పాకిస్తాన్‌కు భారత్‌ అంటే దడే…! గత ఏడాది పాకిస్తాన్‌తో జరిగిన వైమానిక పోరులో భారతీయ వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ శత్రువులను తరిమికొడుతూ పాక్‌ భూభాగంలోకి దిగిన వైనం, ఆ తర్వాత పాకిస్తాన్‌ ఆయనను వదిలిపెట్టిన విషయాలు తెలిసినవే కదా! అప్పుడు పాక్‌ ఆర్మీ చీఫ్ జనరల్‌ కమర్‌ జావేద్‌ బాజ్వా గజగజమని వణికిపోయారట! కాళ్లు చేతులు వణికాయట! ఈ విసయాన్ని ఆ దేశ పార్లమెంట్‌ సభ్యుడే చెప్పుకొచ్చారు.. అసలేం జరిగిందంటే.. పుల్వామా ఉగ్రవాదుల దాడి తర్వాత పాకిస్తాన్‌పై అంతకంత బదులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో భారత్‌ ఉండింది.. ఆ వెంటనే సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరిపింది.. ఈ సమయంలోనే గత ఏడాది ఫిబ్రవరి 27న భారత పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ అనుకోకుండా పాక్‌ భూభాగంలో దిగారు.. ఆయన నడుపుతున్న మిగ్‌-21 కూలిపోవడంతో ప్యారాచూట్ సాయాన్ని తీసుకున్నారు.. అది కాస్తా పాక్‌ భూభాగంలో దిగింది.. ఈ క్రమంలో అభినందన్‌కు కొన్ని గాయాలు కూడా అయ్యాయి.. అక్కడే ఉన్న పాక్‌ ఆర్మీ అధికారులు అభినందన్‌ను బంధించారు.. 60 గంటల పాటు తమ అధీనంలో ఉంచుకున్నారు.. ఆ తర్వాత వదిలేశారు.. ఈ వదిలేయడం వెనుక పెద్ద కథ నడిచిందట! ఆ రోజున విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్‌ ఖురేషి ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశానికి ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ హాజరుకాలేదు.. అప్పుడే ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వా రూమ్‌లోకి ఎంటరయ్యారు.. అప్పటికే ఆయన కాళ్లు చేతులు వణుకుతున్నాయి.. ఒళ్లంతా చెమటలు పట్టి ఉంది.. ఆ సమావేశానికి పీపీపీ, పీఎంఎల్‌-ఎన్‌ తదితర పార్టీలు కూడా హాజరయ్యాయి.. సమావేశం అంతా అయ్యాక మహ్మద్‌ ఖురేషిలో కూడా వణకు మొదలయ్యింది.. మీకు పుణ్యముంటుంది.. అభినందన్‌ను వదలనివ్వండి. లేకపోతే రాత్రి తొమ్మిది గంటలకు భారత్‌ మనమీద దాడి చేసేందుకు సిద్ధమవుతోందని ఖురేషి పార్టీలతో మొరపెట్టుకున్నారు.. జరగబోయే నష్టాన్ని తెలుసుకున్న విపక్షాలు కూడా ఇందుకు సరే అన్నాయి.. ఆ రోజు జరిగిన ఘటనను కళ్లకు కట్టినట్టు చెప్పుకొచ్చారు పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌-ఎన్‌ నేత ఆయాజ్‌ సాదిక్‌.. ఈ సందర్భం ఎందుకొచ్చిదంటే ఇమ్రాన్‌ఖాన్‌ సర్కారుకు విపక్షాలు చాలా విషయాలలో సహకరించాయని, మద్దతుగా నిలిచాయని అయినప్పటికీ ఆయనలో మార్పు రావడం లేదని సాదిక్‌ చెబుతూ అభినందన్‌ ఘటనను వివరించారు.. అభినందన్‌ విడుదల విషయంలో ఇమ్రాన్‌ ప్రభుత్వ నిర్ణయంతో తాము ఏకీభవించినట్టు తెలిపారు. నిన్న నేషనల్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆ ఘటనను పూసగుచ్చినట్టు చెప్పారు. ఇదంతా స్థానిక మీడియాలలో కూడా వచ్చింది. శత్రుదేశానికి చిక్కినా అభినందన్‌ ఏ మాత్రం భయపడలేదు.. అదే ధైర్యాన్ని కనబరిచారు.. అందుకే ఆయనను వీరచక్రశౌర్య పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో