Sircilla: 15 రోజులుగా నో ప్రొడక్షన్.. బతుకమ్మ చీరల ఉత్పత్తి పై తీవ్ర ప్రభావం

|

Sep 22, 2021 | 1:37 PM

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సిరిసిల్ల మొత్తం తడిసి ముద్దై పోయింది. రోడ్లు చెరువులయ్యాయి. పట్టణమంతా నీట మునిగింది.

Sircilla: 15 రోజులుగా నో ప్రొడక్షన్..  బతుకమ్మ చీరల ఉత్పత్తి పై తీవ్ర ప్రభావం
Bathukamma Sarees
Follow us on

Bathukamma sarees: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సిరిసిల్ల మొత్తం తడిసి ముద్దై పోయింది. రోడ్లు చెరువులయ్యాయి. పట్టణమంతా నీట మునిగింది. ఈ సిట్యువేషన్లో ఇక్కడి వస్త్ర పరిశ్రమ పూర్తిగా తడిసి ముద్దయి పోయింది. దీంతో మరమగ్గాలు, ముడి సరుకు, ఇప్పటికే తయారైన దుస్తులు మొత్తం పనికి రాకుండా పోయాయి. దీంతో ఇక్కడి చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో చిక్కింది. మొత్తం 15 రోజుల పాటు బందు కావడంతో.. బతుకమ్మ చీరల ఉత్పత్తి పై ఇది ప్రభావం చూపింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బతుకమ్మ చీరల ఉత్పత్తి చేస్తూ ఇక్కడ కార్మికులు ఉపాది పొందుతుంటారు. అయితే ఇరవై రోజుల క్రితం కురిసిన వర్షాలకు అనేక కాలనీలు నీట మునిగాయి. కార్మికుల ఇళ్లలోని సామాగ్రి మొత్తం నీట మునిగింది. పవర్ లూమ్ లలో కూడా వరద నీరు చేరింది. బట్ట తడిసి పోగా- మోటార్లలో కూడా నీళ్లు చేరి కాలిపోయాయి. ముడి సరుకు కూడా పూర్తిగా నీట మునిగింది.

కార్ఖానాల్లో చేరిన బురద నీరు తొలిగించడమే ఇక్కడి వారికి కష్టతరంగా మారింది. కొన్ని కార్ఖానాలు తిరిగి ప్రారంభించడం సాధ్యం కాని పనిగా మరాఇంది. సిరిసిల్ల పలు ప్రాంతాల్లో ఉండే కార్ఖానాల్లోకి భారీగా వరదనీరొచ్చి చేరింది. చేనేత జౌళీ శాఖ సర్వే ప్రకారం.. 137 కార్ఖానాల్లోని 1516 మరమగ్గాలు దెబ్బ తిన్నాయి. ప్రాధమిక అంచనాల ప్రకారం 37 లక్షల రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క తేల్చారు అధికారులు. అంతకన్నా ఎక్కువ నష్టం జరిగిందంటున్నారు పవర్ లూమ్ యజమానులు.

5 వేల మరమగ్గాలు దెబ్బ తిన్నట్టు చెబుతున్నారు యజమానులు. వీటితో పాటు వార్ఫిన్, డయ్యింగ్ యూనిట్లు కూడా దెబ్బతిన్నాయ్. బట్ట తడిసిపోయింది. బురద తీయలేక అష్టకష్టాలు పడుతున్నామని అంటున్నారు పవర్ లూమ్ యజమానులు. 5వేలకు పైగా మరమగ్గాలు దెబ్బతిన్నట్లు ఆసాములు చెబుతున్నారు. వీటితోపాటు వార్ఫిన్‌, డైయింగ్‌ యూనిట్లు దెబ్బతిన్నాయి. బట్ట తడిసిపోయింది. బురదను తొలగించుకోలేక పవర్‌లూం ఆసాములు, ఇబ్బందులు పడుతున్నారు.

భారీగా నష్టం ఏర్పడిందనీ.. బతుకమ్మ చీరల ఉత్పత్తిలో 1. 30 కోట్ల మీటర్ల ఉత్పత్తి దెబ్బ తినింది. భారీ వర్షాలతో పవర్ లూమ్ కార్ఖానాల్లోకి వరద నీరు చేరిందనీ.. నష్టంపై సర్వే కూడా తప్పుడు లెక్కలు నమోదయ్యాయని వాపోతున్నారు సిరిసిల్ల నేతన్నలు. రెండు లక్షల మీటర్ల బతుకమ్మ తడిసిన చీరలను ప్రభుత్వం తీసుకుంది. కానీ సిరిసిల్ల పట్టణంలోని శాంతి నగర్ లో భారీ వర్షాలకు మరమగ్గాలు, వార్ఫిన్ పరిశ్రమల్లోకి వరదనీరొచ్చి చేరింది. మర మగ్గాలతో పాటు వార్ఫిన్ యంత్రాలు, కరెంట్ మోటార్లు సైతం కాలిపోయాయి. బతుకమ్మ చీరలకు చెందిన యార్న్ మొత్తం మట్టితో నిండిపోయింది. ఈ యార్న్ ఎందుకూ పనికి రాదు. దీంతో తమకు మరో ఇరవై లక్షల వరకూ నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేనేత కార్మికులు.

మొత్తంగా చూస్తే ఈ భారీ వర్షాలకు పవర్ లూమ్ లు మునిగిపోవడంతో పాటు.. 15 రోజుల పాటు పని ఆగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిరిసిల్ల నేతన్నలు. ఇప్పటికీ తాము కోలుకోలేక పోతున్నామని వాపోతున్నారు.

Read also: PM Modi’s US Visit: అమెరికా పర్యటకు బయల్దేరి వెళ్లిన ప్రధాని మోదీ.. జో బైడెన్ తో భేటీపై సర్వత్రా ఆసక్తి