Viral Video: ఒకే ఒక్క దెబ్బ.. బిడ్డ పరార్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. చూస్తే నవ్వాపుకోలేరంతే..

|

Jun 14, 2021 | 9:12 PM

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలో వైరల్ అవుతాయనే విషయం తెలిసిందే. తాజాగా ట్రెండింగ్‌లో ఉన్న ఓ వీడియో

Viral Video: ఒకే ఒక్క దెబ్బ.. బిడ్డ పరార్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. చూస్తే నవ్వాపుకోలేరంతే..
Virla Video
Follow us on

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలో వైరల్ అవుతాయనే విషయం తెలిసిందే. తాజాగా ట్రెండింగ్‌లో ఉన్న ఓ వీడియో మాత్రం తెగ ఆకట్టుకుంటోంది. ఇందులో బాయ్స్, గర్ల్స్ ఆధిపత్య పోరుకు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి. ఈ సన్నివేశాలు చూడ ముచ్చటగా ఉన్నాయి. సాధారణంగా అయితే అమ్మాయిల కంటే అబ్బాయిలే అధిక బలవంతులు అనే ఫీలింగ్ అందరిలోనూ ఉంటుంది. కానీ, ఈ వీడియో చూస్తే మాత్రం కచ్చితంగా మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు.. ఇకపై ఏ అమ్మాయిని తక్కువ అంచనా వేయరు కూడా.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వైరల్ వీడియోలో ఓ బాలుడు, బాలిక మధ్య పోట్లాట జరుగుతుంది. అందులో బాలుడు.. ఆ బాలికపై దాడి చేయబోగా తిరగబడుతుంది. అంతేకాదు.. ఒకే ఒక్క కిక్ ఇవ్వడంతో ఆ పిల్లాడు నేలకూలుతాడు. ఇక అదే వీడియోలో రెండో సన్నివేశంలో.. ర్యాగింగ్ మాదిరిగా ఉంటుంది. మగ పిల్లల గుంపు.. ఆడ పిల్లలను ఏడిపించే ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగా ఓ పిల్లాడు తన కరాటే స్కిల్స్ అన్నింటినీ ప్రదర్శిస్తాడు. బాలికపై దాడి చేయబోతాడు. అయితే, ఆ బాలికలు ఊరుకుంటారా? మరి. అమ్మాయిలంతా ఏకమై తమ కరాటే స్కిల్స్‌ని చూపించారు. దాంతో బిత్తరపోవడం వారి వంతైంది. అమ్మాయిల ముందు అతి చేసిన పిల్లాడు అక్కడి నుంచి పరారయ్యాడు.

ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియోను ఐపిఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు.. ‘బాయ్స్ వర్సెస్ గర్ల్స్? వందమంది స్వర్ణకారులు, ఒక వడ్రంగి’ అని క్యాప్షన్ కూడా పెట్టారు. కాగా, రూపిన్ శర్మ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆడవారి శక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆడవారిని తక్కువ అంచనా వేయొద్దంటూ హితవచనాలు కామెంట్స్ చేస్తున్నారు.

Also read:

Salaar Movie: సలార్‌ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్న డార్లింగ్.. చకచకా సినిమాలు ఫినిష్ చేయాలని చూస్తున్న ప్రభాస్..