Viral Video: అందరూ పార్టీ మూడ్‌లో ఉన్నారు.. రిసార్ట్ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంతలోనే ఊహించని అతిథులు వచ్చి వారి ప్లాన్‌ను అంతా స్మాష్ చేశాయి. పైగా అవి మాత్రం బాగా ఎంజాయ్ చేశాయి. ఇంతకీ వచ్చిన అతిథులు ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అమెరికాలోని గాట్లిన్‌బర్గ్ పరిధిలో గల చాలెట్ గ్రామంలోని ఓ రిసార్ట్‌లో స్కూల్ విద్యార్థులు, టీచర్స్ వారంతపు సెలవును ఆస్వాధీస్తూ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అయితే, వారితో జత కట్టాలని భావించాయో ఏమో గానీ.. ఏడు నల్ల ఎలుగుబంట్లు వారు పార్టీ చేసుకుంటున్న ప్రదేశానికి వచ్చాయి. దాంతో వారు హడలిపోయి రిసార్ట్ గదుల్లోకి పారిపోయారు. అయితే, రిసార్ట్‌లోకి ప్రవేశించిన ఎలుగుబంట్లు స్విమ్మింగ్ పూల్‌ను మొత్తం ఆక్రమించేసుకున్నాయి. పూల్‌లోకి దిగి సరదాగా ఈత కొట్టాయి. అన్నీ కలిసి కాసేపు సందడి చేశాయి. ఎలుగుబంట్లు చేసిన అల్లరిని కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
రిసార్ట్‌లో ఎలుగుబంట్లు చేసిన సందడిని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. నల్ల ఎలుగుబంట్లు చాలా అందంగా ఉన్నాయని, వాటి అల్లరి మరింత ఆకట్టుకుంటోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే.. మనుషులకు మాత్రమే కాదు.. మాకూ ఈత వచ్చు అని ఎలుగుబంట్లు చాటిచెప్పినట్లుగా అనిపిస్తోందని అన్నారు. కాగా, మే 26వ తేదీన షేర్ ఈ వీడియోను రెండు రోజుల వ్యవధిలోనే 10 లక్షలకు పైగా మంది వీక్షించారు. మరెందుకు ఆలస్యం.. ఎలుగుబంట్లు చేసిన సందడిని మీరూ చూసేయండి.